Thursday, May 2, 2024

సిద్దిపేట నలుమూలల అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao inaugurates double bedroom houses

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నలుమూలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మిట్టపల్లి మండలం బొగ్గులోని బండ గ్రామంలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో ఇల్లు లేని వారిని గుర్తించాలని అందుకు కావాల్సిన ఇండ్లను గ్రామానికి మహిళా భవనం, పంచాయతీ భవనం మంజూరు చేస్తామని అన్నారు. బొగ్గులోని బండ గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఐక్యంగా ఉండి స్వచ్ఛ గ్రామంగా మార్చుకుని జాతీయ అవార్డుకు పొందాలని ఆకాంక్షించారు. ఒకప్పుడు బొగ్గులోని కుంట చాలా వెనకబడి ఉండేదని గ్రామంలో జానెడు మోరీ, మూరెడు సిసి రోడ్డు ఉండేది కాదని ఇప్పుడు కావాల్సిన నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రూ. 15 లక్షలతో మిగిలిన సిసి రోడ్డు మంజూరు చేశామని, రూ. 10 లక్షలతో మహిళా భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు.

నూతన గ్రామ పంచాయతీ కాబట్టి త్వరలోనే జిపి భవనాన్ని నిర్మిస్తామని అన్నారు. ఇల్లు స్థలం ఉన్నవారికి కొత్త స్కీం కింద డబ్బులు మంజూరు చేస్తామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. బొగ్గులోని బండ ఇప్పుడు ఖరీదైన గ్రామంగా మారిందని అన్నారు. సిద్దిపేట చుట్టు పక్కల రింగ్ రోడ్డుకు సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారని త్వరలోనే పనులు ప్రారంభిస్త్తామని అన్నారు. సిద్దిపేట నలు మూలల అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ రోడ్డులో కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, కమిషనరేట్ నిర్మించుకున్నామని తెలిపారు. మిట్టపల్లి వైపు రైల్వే స్టేషన్, కోర్టు, జడ్పీ భవన్ నిర్మిస్తామని తెలిపారు. కరీంనగర్, మెదక్ రోడ్డుపై పలు కంపెనీల ఏర్పాటుతో పాటు ప్రభుత్వ భవనాలను నిర్మిస్తామని తెలిపారు. మంత్రి వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, శంకర్, ప్రవీణ్‌రెడ్డి, పాల సాయిరాం, రాములు, కనకయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News