Wednesday, April 24, 2024

ఔర్ ఎక్ దక్క… పదిలో ఫస్ట్ పక్కా : మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

జిల్లాలోని జిల్లా , మండల విద్యా అధికారులు , ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్స్ అందరికి గత సంవత్సరం మొదట స్థానంలో నిలిచేలా కృషి చేసిన అందరికి మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో పదవ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించెలా సన్నద్ధం కావాలాని జిల్లా ప్రజాప్రతినిధులు , జిల్లా విద్యా శాఖ అధికారులతో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్షా సమావేశం మంత్రి హరీష్ రావు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 97.85 % తో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్నామని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయని, సాయంత్రం అల్ఫహారం ఏర్పాటు చేసామని తెలిపారు. ప్రతి విద్యార్థి తల్లి తండ్రులకి ఇంటింటికి ఉత్తరాన్ని పంపామని ఉత్తరం తో విద్యార్థులకు ఉపదేశాని ఇచ్చి తల్లి తండ్రులకు ఆత్మవిశ్వాసం నింపామని సూచించారు. ఈ సారి పదిలో పక్కా ప్రణాళిక తో ముందుకు పోదామని అన్నారు. గత సంవత్సరం 97.85% ఉత్తీర్ణత తో ముందు ఉన్నాం కానీ 10/10 జిపిఎ రావడం లో వెనక పడ్డామని, 10/ 10 జిపిఎ సాధించడం లో ఈ సారి ప్రత్యేక డ్రైవ్ పెట్టాలని సూచించారు.

ప్రతి 10 మంది విద్యార్థులను ప్రత్యేక దృష్టి పెట్టేలా ఒక ఉపాధ్యాయున్నీ దత్తత తీసుకొని, ఇందులో పట్టణం లో, గ్రామాల్లో ఉండే ప్రజాప్రతినిధులు కూడా 10 విద్యార్థుల చొప్పున దత్తత తీసుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు సిలబస్ పూర్తి స్థాయి లో అయిందని, ఇప్పుడు వారికి రివిజన్ టెస్ట్ లు.. రివిజన్ స్టడీ చేస్తున్నము కాని ఇది పాఠశాల వరకు చేస్తున్నాము, మరి ఇంటికి పోయాక వారు క్లాస్ లు వినెల సిద్దిపేట జిల్లాలో పదవ తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ ద్వారా వీడియో రూపకంగా క్లాస్ లు నిర్వహించడానికి సిద్ధం చేస్తున్నామన్నారు.

నేటి విద్యార్థులు , యువతరం సాంకేతిక పరిజ్ఞానం కు విశృంఖలంగా అలవాటు పడ్డారు.. ఆదిశగా ఆ సాంకేతిక పరిజ్ఞానం చదువు పై మనము అలవాటు పడాలని మంత్రి సూచించారు. ఇప్పటి నుండే అన్ లైన్ తరగతులక నిర్వహణ చేసి వారిలో మరింత మేధస్సు పెంపొందించేల డిజిటల్ కంటెంట్ ద్వారా క్లాస్ లు నిర్వహణ కు మరో అడుగు పది నుండే ప్రారంభించాలన్నారు. డిజిటల్ కంటెంట్ ప్రధానంగా అన్ని సబ్జెక్ట్ లు క్యూర్ ఆర్ కోడ్ లు విద్యార్థుల మొబైల్ లో స్కాన్ చేస్తే వారికి ఆ సబ్జెక్ట్ వీడియో ద్వారా క్లాస్ విని అర్థం చేసుకొని చదువు కొనే అవకాశం ఉంటుందని అన్నారు.

ప్రభుత్వ పాఠశాల లో జిల్లా వ్యాప్తంగా 10వేల మంది విద్యార్థులకు కెసిఆర్ డిజిటల్ కంటెంట్ అనే కాన్సెప్ట్ తో బుక్స్ పంపిణీ చేయబోతున్నారని తెలిపారు. దీని పై విద్యా శాఖ అధికారులు , ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలన్నారు.  10 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు , ప్రజాప్రతినిధులు విద్యార్థుల ఇంటికి వెళ్లి పర్యవేక్షణ చేయాలని వివరించారు. ముందు విద్యార్థులకు పాఠశాలలో వారికి అవగాహన సదస్సు నిర్వహించాలని, ప్రత్యేక తరగతులు , ఉత్తరం, డిజిటల్ కంటెంట్ ఇలా మూడు రకాలుగా ఈ సంవత్సరం పదిలో పక్కా ప్రణాళిక తో పోవాలని పేర్కోన్నారు.

ఇందుకు మీరు అందరూ ప్రత్యేక కృషి చేయాలని కోరారు. విద్యార్థులకు పాఠశాలకు ఏ అవసరం ఉన్న మేము ఉన్నామని, రెసిడెన్షియల్ , కస్తూర్బ , మోడల్ స్కూల్ అన్ని పాఠశాల మంచి ఉత్తీర్ణత సాదించాలని, గతంలో కరోన కంటే ముందు 100% ఉత్తీర్ణత సాదించిన పాఠశాల కు 25 వేలు ఇచ్చామని, ఈ సారి కూడా 100% ఉత్తీర్ణత సాదించిన పాఠశాల లు 25 వేలు రూపాయల నగదు బాహుమతి ఇస్తామని, 10/10 జిపిఎ సాదించిన విద్యార్థులకు 10వేల రూపాయల నగదు బహుమతి ఇస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News