Tuesday, April 30, 2024

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తక్కువ

- Advertisement -
- Advertisement -

Minister Jagadish Reddy and T. Harish Rao review with power owners

ఇతర రాష్ట్రాలతో పోల్చితే

ప్రభుత్వం సబ్సిడీలు పెంచి చెల్లించినా సంస్థలకు నష్టాలు
200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఏటా రూ.1,253 కోట్ల సబ్సిడీ, వ్యవసాయ తదితర సబ్సిడీలకు రూ.10,000 కోట్లు, బిజెపి, కాంగ్రెస్, కమ్యూనిస్టు రాష్ట్రాల్లో రైతుల నుంచి నెలకు రూ. 2,500 పైగా కరెంట్ బిల్లుల వసూలు, గుజరాత్, యుపిలలోనూ వ్యవసాయానికి ఉచితం లేదు, డిస్కంల యాజమాన్యాలతో సుదీర్ఘ సమీక్షలో మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావులు

మనతెలంగాణ/హైదరాబాద్ : డిస్కంల నష్టాలను పూడ్చుకునే పనిలో రాష్ట్రప్రభుత్వం నిమగ్నమయ్యింది. వరుసగా మూడో రోజు విద్యుత్ యాజమాన్యాలతో మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, టి.హరీష్‌రావులు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. 50 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించుకున్న వారికి కేవలం 1.45 పైసలకే యూనిట్ విద్యుత్‌ను అందిస్తూ దిగువ, మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్గిస్తున్న సంస్థలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి ఏటా రూ.1253 కోట్లతో కలి పి రూ.10వేల కోట్లు సబ్సిడీ రూపంలో డిస్కంలకు అందిస్తున్నా విద్యుత్ పంపి ణీ సంస్థలకు నష్టాలు తప్పడం లేదని మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల ధరలతో పాటు ఇక్కడి ధరల గురించి మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్ కో అండ్ జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి జి.రఘుమారెడ్డి, జెఎండి శ్రీనివాసరావు, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ డైరెక్టర్ శ్రీనివాస్, స్వామిరెడ్డిలు ఈ సమీక్షలో పాల్గొని మంత్రులకు తమ సమస్యలను, ప్రతిపాదనలను మంత్రులకు తెలియచేశారు.

మిగతా రాష్ట్రాల ధరలపై సమీక్ష

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే దిగువ మధ్యతరగతి గృహ వినియోగదారులకు 50 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించుకుం టున్న వారి నుంచి రాష్ట్రంలో కేవలం రూ.1.45 పైసలు వసూలు చేస్తుండగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అదే 50 యూనిట్ల లోపు వినియోగించుకునే వారి నుంచి రూ. 3.30 పైసలు, ఉత్తరప్రదేశ్‌లో మూడు రూపాయలు, పంజాబ్ లో రూ.3.49 పైసలు, అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 4.02 రూపాయలు వసూలు చేస్తున్న అంశం పై మంత్రులు సమీక్షించారు. ఇదే విషయంలో మరింత లోతుగా సమీక్ష నిర్వహించిన మంత్రులు 100 యూ నిట్ల విద్యుత్‌ను వినియోగించుకునే వినియోగదారుల సరాసరి బిల్లు తెలంగాణాలో రూ.239లుగా ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌లో 861 రూపాయలు బిజెపి పాలిత కర్ణాటకలో రూ.702లు, పశ్చిమ బెంగాల్ లో రూ.759లు, మహారాష్ట్రలో రూ.677లు, గుజరాత్‌లో రూ.601లు, కేరళలో రూ.476లు, పంజాబ్ లో రూ.473లు, ఉత్తరప్రదేశ్‌లో రూ.457లు వసూలు చేస్తున్నారని అధికారులు మంత్రులతో పేర్కొన్నారు.

రాష్ట్రంలో 200 యూనిట్లకు రూ.822లు వసూలు

అంతే గాకుండా కుల, మతాలకు అతీతంగా 200 యూనిట్ల విద్యుత్ లోపు వాడుతున్న వినియోగదారులకు సబ్సిడీలు అందించి రాష్ట్రంలో కేవలం నెలకు 200 యూనిట్లు వినియోగిస్తున్న వారి నుంచి 822 రూపాయలు వసూలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇదే అంశాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మహారాష్ట్రలో అదే 200 లోపు యూనిట్లు వినియోగించుకుంటున్న వినియోగదారుల నుంచి అధికంగా 1,689 రూపాయలు, రాజస్థాన్‌లో రూ.1,666లు, పశ్చిమ బెంగాల్ లో రూ.1,630లు, కర్ణాటకలో రూ.1,556లు, మధ్యప్రదేశ్ రూ.1,427లు, గుజరాత్‌లో రూ. 1,285లు, కేరళలో రూ.1,224లు వసూలు చేస్తున్నట్టుగా అధికారులు పేర్కొన్నారు.

ఒక్కో యూనిట్ సరఫరా వ్యయం 7.24 పైసలు

తెలంగాణ డిస్కంలు ఒక్కో యూనిట్ సరఫరా వ్యయానికి 7.24 పైసలు ఖర్చు చేస్తుండగా 50 యూనిట్ల లోపు వినియోగదారులకు1.45 పైసలు 100 యూనిట్ల వరకు 2.60 పైసలు 200 యూనిట్ల 4.30 పైసలను మాత్రమే గృహ వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నామని అధికారులు మంత్రులతో పేర్కొన్నారు. సరఫరా వ్యయానికి గృహా వినియోగదారులు చెల్లించే మొత్తాల్లో ఉన్న వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని అధికారులు మంత్రులతో తెలిపారు. సబ్సిడీ లేకపోతే 50 యూనిట్లు వినియోగించుకుంటున్న గృహ వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తం 362 రూపాయలు, కానీ , సబ్సిడీ అమల్లో ఉండడంతో 101 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. అంతే గాకుండా 100 యూనిట్లు వినియోగించే వినియోగదారులు ప్రస్తుతం చెల్లించేది కేవలం 239 రూపాయలు మాత్రమే, అదే సబ్సిడీలు లేకుంటే వారు చెల్లించాల్సింది 724 రూపాయలకు ఉంటుందని దీనివల్లే డిస్కంలకు భారీగా నష్టాలు వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.

గుజరాత్‌లోనూ రైతుల నుంచి డబ్బుల వసూలు

వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్‌కు సైతం తె లంగాణ మినహా మిగతా రాష్ట్రాలన్నీ నెలవారీ బిల్లులు వ సూలు చేస్తున్నప్పటికీ 24 గంటల విద్యుత్ సరఫరా ఎక్కడా ఇవ్వడం లేదని అధికారులు మంత్రులతో తెలిపా రు. ప్రధాని మోదీ రాష్ట్రమైన గుజరాత్‌లో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ కేవలం 9 గంటలే విద్యుత్ సరఫరా చేస్తున్నారని వారు పేర్కొన్నారు. అదే గుజరాత్ లో 9 గంటలు విద్యుత్‌ను వినియోగించు కుంటున్న ఒక్కో రైతు నుంచి ఒక్కో మోటారు కనెక్షన్ నుంచి నెలకు 667 రూపాయలు వసూలు చేస్తుండగా అదే 9 గంటలు సరఫరా చేస్తున్న ఉత్తరప్రదేశ్ లో నెలకు రూ.2,408, ఇతర రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్‌లో నెలకు రూ.4,558, మహారాష్ట్ర నెలకు రూ.1,609, ఏడు గంటలు మాత్రమే విద్యు త్ నందిస్తున్న రాజస్థాన్‌లో రూ.1,800లు వసూలు చేస్తున్నారు. అదే విధంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్న కేరళలో 9 గంటలు విద్యుత్‌ను వినియోగించుకున్నందుకు గాను ఒక్కో వ్యవసాయ కనెక్షన్‌కు నెల ఒక్కంటికీ రూ.2,952 రూపాయలు వసూలు చేస్తున్నారని, మనదగ్గర వ్యవసాయ వినియోగదారులకు 24 గంటలు ఉచిత నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను అందించడంతో పాటు ఒక్క రూపాయి వసూలు చేయడం లేదని అధికారులు మంత్రులతో తెలిపారు.

సిఎం కెసిఆర్ దృష్టికి…

రాష్ట్ర ఏర్పాటుకు ముందు విద్యుత్ సంక్షోభం తో రోడ్డెక్కిన పరిశ్రమల రంగం ఈ ఏడేళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిన నేపథ్యంలో తమిళ నాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు తెలంగాణ డిస్కంలు తక్కువ ధరలకే నాణ్యమైన విద్యుత్ నందిస్తున్న విషయంపై కూడా ఈ సమీక్షలో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలో పలు రాష్ట్రాల్లో అమలవుతున్న కరెంట్ చార్జీలతో పాటు పలు అంశాలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రుల బృందం నిర్ణయించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News