Tuesday, May 7, 2024

దివ్యాంగుల పెన్షన్ పెంపుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం

- Advertisement -
- Advertisement -
సిఎం కెసిఆర్ మాట నిలుపుకున్నారు
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు  తెలిపిన మంత్రి

హైదరాబాద్ : దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సిఎంగా కెసిఆర్ నిలిచిపోతారని ఎస్‌సి అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం ప్రతి నెల ఇస్తున్న 3016 రూపాయల పెన్షన్ ను మరో వెయ్యి రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మంత్రి కొప్పుల హర్షం వ్యక్తం చేశారు.. శారీరక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పిస్తున్నదని మంత్రి కొప్పుల చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన 5,16,890 మంది దివ్యాంగులకు ప్రతి నెలా రూ.3,016 చొప్పున పదేళ్ళలో రూ.10,310.36 కోట్లను పింఛన్ల రూపంలో ఇప్పటి వరకు అందించడం జరిగిందని చెప్పారు. ఈ నెల నుంచి దివ్యంగులకు రూ.4016 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, పెన్షన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇంత అద్భుతంగా అమలు కావడం లేదన్నారు. దివ్యాంగులు అందరితో సమానంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ కట్టుబడి ఉన్నారని చెప్పారు.

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News