Thursday, May 2, 2024

ఎవరు ఎవరికిస్తున్నారు?

- Advertisement -
- Advertisement -

Minister ktr comments on bandi sanjay

కేంద్రం నిధులను మాకిస్తున్నదా
మేము వాళ్లకిస్తున్నామా?
మావద్ద నుంచి రూపాయి గుంజుకొని రూపాయి ఇస్తున్నది,
ఇది నిజం కాకపోతే నేను రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు
ఎంపి పదవి నుంచి వైదొలుగుతావా?
గద్వాల బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షుడు
బండి సంజయ్‌కి సవాల్
గత ఏడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలందరూ
కేంద్రానికి పన్నుల రూపంలో చెల్లించింది
రూ.2.72 లక్షల కోట్లు, కేంద్రం నుంచి
రాష్ట్రానికి వచ్చింది రూ.1.42లక్షల కోట్లు
రాష్ట్ర పథకాలన్నింటికీ కేంద్రం నుంచి నిధులు
వస్తున్నాయని సంజయ్ ఆరోపిస్తున్నారు
అటువంటప్పుడు బిజెపి పాలిత రాష్ట్రాల్లో
ఇక్కడి పథకాలు ఎందుకు అమలు కావడం లేదు?
రాజకీయ ప్రయోజనాల కోసమే అడ్డగోలు ప్రకటనలు
చేస్తున్నారు అభివృద్ధి సంక్షేమాల్లో తెలంగాణ దేశానికే
ఆదర్శంగా నిలుస్తుంటే రాష్ట్రంపై వివక్ష చూపుతోంది

మన తెలంగాణ/మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ బిజెపి శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ కెటిఆర్ సవాల్ విసిరారు. తన సవా ల్‌ను ఆయన స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఈ బహి రంగ సభ వేదికపై నుంచి తాను చెప్పేది తప్పు అయితే రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఒకవేళ బండి చెప్పేది తప్పు అయితే ఆయన తన ఎంపి పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. గత ఏడు సంవ త్సరాలుగా రాష్ట్ర ప్రజలందరూ కేంద్రానికి పన్నుల రూపంలో కట్టింది రూ రూ.2.72 లక్షల కోట్లు కాగా అక్క డి నుంచి తిరిగిన రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.1.42 లక్షల కోట్లు మాత్రమేనని అన్నారు.అంటే ఒక రూపాయి మనం కేంద్రానికి కడితే… అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చిన తెలంగాణకు అర్ధరూపాయి అని వ్యాఖ్యానించారు.

ఈ విషయాన్ని బండి సంజయ్ తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలన్నింటికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని ఆరోపిస్తున్న బండి సంజయ్…మరి బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు జరగడం లేదని మంత్రి కెటిఆర్ నిలదీశారు. కేవలం రాజ కీయ ప్రయోజనాల కోసమే ఆయన అడ్డగోలుగా మాట్లా డుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల్లో తెలంగాణా దేశానికి ఆదర్శంగా ని లుస్తున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రంపై వివక్ష చూపుతోందని కెటిఆర్ కెటిఆర్ ఆరోపించారు. మంగళ వారం ఆయన గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో పలు అభివృద్ది పనులు, కొత్త పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం గద్వాల జిల్లా కేం ద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెటిఆర్ ప్రసంగిస్తూ,రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతి ఏటా జిఎస్‌టి, ఇతరత్రా పన్నుల రూపంలో కోట్లాది రూపాయాలు వెళ్తుంటే , కేంద్రం ప్రభుత్వం మాత్రం తెలంగాణాకు సగం నిధులు కూడా విడుదల చేయడం లేదని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోందన్నారు. రైతుబంధు, రైతులకు 24 గంటల కరెంట్, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, దళిత బందు వంటి పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రానికి పెద్దఎత్తున ఆర్ధిక భారం పడుతున్నప్పటికీ పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనే లక్షంతో సిఎం కెసిఆర్ మొండిధైర్యంతో ముందుకు సాగుతున్నారన్నారు. కెసిఆర్ చేపట్టిన పథకాలు, అభివృద్దిని చూసి అనేక రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయన్నారు. కొందరు అభివృద్దిని అడ్డుకోవాలనే సిఎం కెసిఆర్‌ను తిడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్‌ను తిట్టినంత మాత్రాన వారు పెద్ద నాయకులు కాలేరని ఎద్దేవా చేశారు. అయినా కెసిఆర్ మామూలు నాయకుడు కాదని, ఆయన ఒక శక్తి అని కెటిఆర్ అభివర్ణించారు.

ఆ శక్తి ముందు ఎవరూ తట్టుకోలేరని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. తెలంగాణా రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం కోసం సిద్ధపడిన మహానీయుడు కెసిఆర్ అని అన్నారు. అలాంటి నాయకుడుని తిడితే వారికే నష్టమన్నారు. ముందు బండి సంజయ్ కేంద్రం నుంచి తెలంగాణాకు రావాల్సిన నిధులపై కేంద్రంను నిలదీయాలని సూచించారు. ఒకప్పటి పాలమూరు అంటే వలసలకు నిలయంగా ఉండేదన్నారు. టిఆర్‌ఎస్‌అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని పాలమూరు జిల్లాను సశ్య శ్యామలం చేశారన్నారు. అందులో భాగంగానే గతంలో వలసలుగా వెళ్లిన జిల్లా ప్రజలు ఇప్పడు సుభిక్షంగా ఉండి ఇతర జిల్లాలు, రాష్ట్రాల వలస కూలీలకు ఉపాధి చూపుతున్నారన్నారు.

ఇక్కడి ప్రగతిని చూసి కర్నూలు, కర్నాటక నుంచి వలసలు వచ్చి ఇక్కడ పనులు గురించి వస్తున్నారన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో ఏ ఒక్కరూ బాధ పడుకూడదని, అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలని కోరుకునే మహానేత కెసిఆర్ అన్నారు. ఒక్క రోజే ఈ జిల్లాలో రూ.104 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. గద్వాల, అలంపూర్‌లో అత్యధికంగా జనాభా ఉన్న బోయ కులస్దులను ఎస్‌టిలో చేర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.ఈ సభలో మంత్రులు, శ్రీనివాస్ గౌడ్,నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అబ్రహాం, బండ్ల క్రిష్టమోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రాం మోహన్ రెడ్డి, ఎంపి రాములు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News