Saturday, April 27, 2024

క్వాడ్ కూటమిపై చైనా మండిపాటు

- Advertisement -
- Advertisement -

విఫల బృందమంటూ విమర్శ

బీజింగ్: ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకొని ఏర్పడే బృందాలు విఫలమవుతాయని క్వాడ్ దేశాలనుద్దేశిస్తూ చైనా విమర్శించింది. పరస్పర సహకారం కోసం ఏర్పాటయ్యే బృందాలు మూడో పార్టీని టార్గెట్‌గా చేయడం సరైంది కాదని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఝావోలిజియాన్ అన్నారు. ప్రాంతీయ సహకారం కోసం ఏర్పాటయ్యే యంత్రాంగాలు శాంతి, అభివృద్ధిని అనుసరించాలన్నది చైనా విశ్వాసమని ఆయన అన్నారు. ఇతర దేశాలను లక్షంగా చేసుకునే బృందాలకు మద్దతు లభించదని ఆయన అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా కేవలం ఆర్థికంగా వృద్ధి చెందిన దేశంగానేగాక, ఈ ప్రాంత కాపలాదారు అని ఆయన అన్నారు. చైనా అభివృద్ధి ప్రపంచ శాంతికి శక్తినిస్తుంది. ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిస్తుందని ఝావో అన్నారు. ఈ నెల 24న వాషింగ్టన్‌లో క్వాడ్ దేశాలు భేటీ కానున్న నేపథ్యంలో చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. ఇండోపసిఫిక్ ప్రాంతంలో చైనా ఏకఛత్రాధిపత్యానికి క్వాడ్ కూటమి సవాల్‌గా నిలువనున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News