Wednesday, May 8, 2024

ఆద్యంతం ఆసక్తికరంగా..

- Advertisement -
- Advertisement -

Pelli Sandadi teaser released

 

రోషన్, శ్రీ లీలా హీరో హీరోయిన్‌లుగా గౌరీ రోనంకీ దర్శకత్వంలో ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై మాధవీ కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మిస్తున్న చిత్రం ‘పెళ్లి సందD’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు విడుదలై ఇప్పటికే విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు వశిష్ట పాత్రలో నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి ఆయన దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఇక ఈ చిత్రం టీజర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. ‘పెళ్లి సందD’ మూవీ చాలా పెద్ద హిట్ కావాలంటూ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News