- Advertisement -
జీఎస్టీ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. దేశ ప్రజలను దోచుకునేందుకే నాడు జీఎస్టీని ఆయుధంగా వాడారని, వాళ్లే పన్నులు వేసి, వాళ్లే తగ్గించి, ఇప్పుడు వాళ్లే సంబురాలు చేసుకుంటున్నారని దీనిని మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదని ఆయన దుయ్యబట్టారు. మంగళవారం గాంధీ భవన్‌లో మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ 8 ఏళ్లుగా జీఎస్టీ పేరుతో పేదల రక్తం తాగి ఇప్పుడు పేదలకు లబ్ధి చేసినట్టు బిజెపి నాయకులు బిల్డప్ ఇస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. జీఎస్టీ తగ్గింపు అంత ఎన్నికల డ్రామా అని, ఇంకా జీఎస్టీ ఫలాలు పేదోడికి అందలేదన్నారు.
- Advertisement -