Thursday, May 2, 2024

‘నా.. నీ ప్రేమ కథ’ ట్రైలర్‌ను లాంచ్ చేసిన మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

అముద శ్రీనివాస్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా.. నీ ప్రేమ కథ’. కారుణ్య చౌదరి కథానాయిక. పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ‘నా.. నీ ప్రేమ కథ’ ట్రైలర్ ని లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ట్రైలర్ అద్భుతంగా ఉంది.  హీరోగా దర్శకునిగా అముద శ్రీనివాస్ మంచి ప్రతిభను కనబరిచారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకముంది. నటీనటులు అంతా మంచి ప్రతిభ కనబరిచారు. ఈ చిత్రం నిర్మాత  పోత్నాక్ శ్రవణ్ మంచి లాభాలు రావాలి. హీరో దర్శకుడు అముద శ్రీనివాస్ కి మంచి అవకాశాలు అందుకోవాలి. చిత్ర యూనిట్ అందరికీ శుభాభినందనాలు’ తెలిపారు. ఈ చిత్రానికి ఎంఎస్ కిరణ్ కుమార్ కెమరామెన్ గా పని చేస్తున్నారు. ఎంఎల్ పి రాజా సంగీతం సమకూరుస్తుండగా చిన్నా నేపధ్య సంగీతం అందిసస్తున్నారు. నందమూరి హరి ఎడిటర్ గా పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News