ఏప్రిల్‌జులై వరకు కేటాయించిన
దానికన్నా తక్కువ సరఫరా
తక్షణమే ఆ లోటును భర్తీ
చేయండి కేంద్ర మంత్రి నడ్డాకు
మంత్రి తుమ్మల విజ్ఞప్తి
పామాయిల్ దిగుమతి సుంకం
పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి
నిర్మలా సీతారామన్‌కు వినతి
ఢిల్లీలో ఇద్దరు కేంద్ర
మంత్రులను కలసిన తుమ్మల
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో యూరి యా లోటు తీర్చాలని, క్రూడ్ పామాయిల్ ఆయిల్ పై దిగుమంతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పార్లమెంటులో ఎంపి చామల కిరణ్ కుమార్‌రెడ్డితో కలసి కేంద్ర మంత్రులు జెపి నడ్డా, నిర్మాలా సీతారామన్‌లను కలుసుకుని విజ్ఞ ప్తి చేశారు. ఆగస్టు నెల కేటాయింపులు, ఏప్రిల్ నుంచి జూలై వరకు ఏర్పడిన యూరియా లోటు ను ఆగస్టు నెలతో కలిసి సరఫరా చేయాలని కేంద్ర మంత్రి నడ్డాను కోరారు. అదేవిధంగా క్రూడ్ పా మాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి తుమ్మల సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 10.9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు మాత్రమే అందుబాటులో ఉ న్నాయని, యూరియా సరఫరాలో ఆలస్యం అయి తే రైతాంగం ఇబ్బందులు పడే అవకాశం ఉందని మంత్రి తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. కేం ద్రం ఆగస్టు నెలకు రాష్ట్రానికి 1.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిన కోటాను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఏప్రిల్ నుంచి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరాలో ఏర్పడిన కొరత 2.10 లక్షల మెట్రిక్ టన్నులను కలుపుకుని ఆగస్టులో విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
క్రూడ్ పామాయిల్ సుంకం పెంచాలి
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలుసుకున్న సందర్భంగా మంత్రి తుమ్మల క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించడం వల్ల ఆయిల్ పామ్ గెలల ధర తగ్గడంతో పాటు కేంద్రం నిర్ణయం ఆయాల్ పామ్ సాగు ప్రోత్సాహకానికి గుదిబండగా మారిందని విచారం వ్యక్తం చేశారు. ఇంతకు ముందే దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 44 శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్ధించిన విషయాన్ని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం సాగు సీజన్ ప్రారంభమైన నేపధ్యంలో రాష్ట్రాలు రైతాంగానికి ప్రొత్సాహకాలు కల్పిస్తున్నాయని, ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగుమతిసుంకం పెంపుదల అంశాన్ని మరోసారి సమీక్షించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకంలో దేశంలోనే తెలంగాణ ఆయిల్ ప్లాంటేషన్ లో తొలిస్థానంలో ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణ కోసం చేస్తున్న కార్యక్రమాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించారు.