Monday, May 20, 2024

దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం

- Advertisement -
- Advertisement -

మంగపేట: దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగ చేస్తున్నారని కాంగ్రెస్ మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని గ్రోమోర్ వద్ద ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పటేల్ సూచనల మేరకు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు అక్కడి నుండి ర్యాలీగా ఏటూరునాగారం బూర్గం పాడ్ రహదారికి చేరుకునిరాస్తారోకో చేరుకున్నారు. దశాబ్ది ఉత్సవాలు ఎందుకోసం ఎవరి కోసం అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దశాబ్ది ఉత్సవాల పేరుతో పార్టీ ప్రచారం అధికారుల ద్వారా చేసుకుంటున్నారని విమర్శించారు. బంగారు తెలంగణ చేస్తాం అని అప్పుల తెలంగాణ చేస్తున్నారని అన్నారు. రైతులు పండించిన ధాన్యం ఎక్కడ చూసినా కల్లాల్లోనే ఉన్నందుకే ఉత్సవాల లేదా గిరిజన రైతన్నలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిరని ఉత్సవాలు లేదా నిరుద్యోగ యువతీ యువకులకు నోటిఫికేషన్ ఇచ్చి పేపర్ లీకేజీలు చేసినందుకా ఈ ఉత్సవాలని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇంచ్చి నందుకా, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేశారని చేసుకుంటున్నారా అనిప్రశ్నించారు.

ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినందుకు ఉత్సవాలు చేసుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న నియంత పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుధ్ధి చెబుతారని హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించి అధికారంలోకి తేవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు బండా జగన్మోహన్‌రెడ్డి, ఇస్సార్ ఖాన్, కార్రి నాగేంద్ర బాబు, మైబూబ్ ఖాన్, లావుడ్యా శ్యాంలాల్, దీకొండ కాంతారావు, కోడెల నరేష్, కొంకతి సాంబశివరావు, ఆకు తోట వెంకన్న, ఎంపెల్లి సమ్మయ్య, శానం నిర్మల, మురుకుట్ల నరేందర్, చౌలం వెంకటేశ్వర్లు, పల్లి కోండ యాదగిరి, చాద మల్లయ్య, ముత్తినేని ఆదినారాయణ హిదియతుల్లా, పల్నాటి సంతోష్, ఆయ్యోరియానయ్య, తూడి భగవాన్ రెడ్డి, వెంగల బుచ్చిరెడ్డి, మసిరెడ్డి వెంకటరెడ్డి, ఎర్రంగారి సురేష్, సయ్యద్ ముస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News