Thursday, September 25, 2025

రైలు పైనుంచి బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం అద్భుతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైలు పైనుంచి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడంతో ఆయుధ శక్తిలో భారత్ ముందుకెళ్తోంది. అణు సామర్థం ఉన్న అగ్రిప్రైమ్ మిస్సైల్‌ను రైలు పైనుంచి ప్రయోగించామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అతి తక్కువ సమయంలో అవసరమైన ప్రదేశానికి రైలు ఆధారిత మొబైల్ లాంచ్ చేయడం గొప్ప విషయమని డిఆర్‌డిఒను రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. రైలు నెట్ వర్క్ సాయం లేకుండా దేశంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా తీసుకెళ్లడంతో పాటు శత్రువు కంటపడకుండా ప్రయోగించవచ్చని తెలియజేశారు. ఈ  క్షిపణి సుమారు 2000 కిలోమీటర్ల వరకు పరిధిని కవర్ చేయగలుగుతుందన్నారు. డిఆర్డీఓ, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్,ఆర్మ్డ్ ఫోర్సెస్, అగ్ని-ప్రైమ్ క్షిపణి విజయవంతంగా పరీక్షించినందుకు అభినందనలు తెలిపారు.

అగ్నిఫ్రైమ్ మిస్సైల్‌లో అత్యాధునిక ఫీచర్లు ఉండడంతో పాటు రక్షణ శాఖకు అదనపు బలంగా ఉంటుందని డిఆర్‌డిఒ వెల్లడించింది. ఈ క్షిపణినికి కెనిస్టర్ డిజైన్ ఉండడంతో తేలికగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా రవాణా చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఈ మిస్సైల్‌ తో జిపిఎస్, నావిక్ శాటిలైట్ నేవిగేషన్లకు కూడా వాడుకోవచ్చు. ఈ క్షిపణిలో రింగ్ లేజర్ గైరో ఉండడంతో ఇనర్షల్ నేవిగేషన్, మైక్రో ఇనర్షల్ నేవిగేషన్ సిస్టమ్‌లను అమర్చారు. పలు టెస్టుల్లో ఈ మిస్సైల్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News