చెన్నై: తన కుమారుడు, రాష్ట్రీ క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు పదోన్నతి కల్పించాలంటూ పార్టీలో డిమాండు పెరుగుతన్న మాట వాస్తవమేనని తమిలనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ అంగీకరించారు. అయితే అందుకు సమయం ఇంకా ఆసన్నం కాలేదని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. సోమవారం నాడిక్కడ అధికారిక కార్యక్రమాలలో పాల్గొన్న స్టాలిన్‌తో విలేకరులు పార్టీలో ఉదయనిధి స్టాలిన్‌ను ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్ గురించి ప్రశ్నించగా డిమాండు వలపడుతున్న మాట వాస్తవమేకాని అది పరిపక్వతకు రాలేదని వ్యాఖ్యానించారు.
ఉదయనిధికి పదోన్నతి కల్పించడానికి సరైన సమయం ఆసన్నం కాలేదని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని డిఎంకెలో గత కొంతకాలంగా డిమాండు వినపడుతోంది. క్రీడలు, యువజన సంక్షేమ శాఖలతోపాటు ప్రత్యేక కార్యక్రమ అమలు శాఖను కూడా ఉదయనిధి నిర్వర్తిస్తున్నారు. చెన్నై మెట్రో రైల్ ఫేస్ 3 వంటి కీలక ప్రాజెక్టుల అమలును పర్యవేక్షించడం, సమీక్షంచడం ఆయన చేస్తున్నారు.