Wednesday, May 1, 2024

బస్తీ దవాఖానాలతో పేదల చెంతకే వైద్యం: మాగంటి గోపీనాథ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బస్తీ దవాఖాన ఏర్పాటుతో నిరుపేదల చెంతకే మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లారెడ్డి గూడలోని కమ్యునిటీ హాల్ లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా గోపినాధ్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు గ్రేటర్ వ్యాప్తంగా 350 బస్తీ దవాఖానాలకు గాను ఇప్పటీ వరకు 280 పై చిలుకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

ఈ బస్తీ దవాఖానా ద్వారా ఉచిత మందులతో పాటు వివిధ వ్యాధులకు సంబంధిచి టెస్టుల నిర్వహిస్తున్నారని చెప్పారు. గ్రేటర్‌లో మొత్తం 150 వార్డులుంగా ప్రతి వార్డుకు రెండు చోప్పున బస్తీ దవఖానాల ఏర్పాటు పూరైన తర్వాత అదనంగా 50 బస్తీ దవాఖానాలపై దృష్టి సారిస్తారని చెప్పారు. చేస్తున్నట్లు తెలిపారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఇప్పటి వరకు 350 బస్తీ దవాఖాన ల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సంగీత యాదవ్, డాక్టర్ రజిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News