Sunday, April 28, 2024

సంధ్యను అభినందించిన ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kalvakuntla Kavitha congratulating Sandhya

హైదరాబాద్: దేశంలో తొలిసారిగా అండర్ గ్రౌండ్ మైనింగ్‌లో సెకండ్ క్లాస్ మేనేజర్‌గా సర్టీఫికెట్ సాధించిన రాసకట్ల సంధ్యను ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్‌లో ఎంఎల్‌సి కవితను రాసకట్ల సంధ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా సంధ్యను కవిత అభినందించారు. మైనింగ్ రంగంలో సంధ్య సాధించిన విజయం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకమన్నారు. సంధ్యరాసకట్ల భారతదేశ మైనింగ్ రంగంలో అండర్ గ్రౌండ్ సెంకండ్ క్లాస్ మేనేజ్‌గా సర్టీఫికెట్ పొందిన తొలిమహిగా చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. రాష్ట్రంలో మహిళలు సాధిస్తున్న విజయాలతో హృదయం గర్వంతో నిండిపోతుందని ఎంఎల్‌సి కవిత చెప్పారు. మహిళలు మరిన్ని విజయాలు సాధించాలన్నారు.

ఎంఎల్‌సి కవిత కృషికి ఫలితం

మహిళలకు మైననింగ్ రంగంలో ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపిగా ఉన్న సమయంలో అనేకసార్లు పార్లమెంట్‌లో కల్వకుంట్ల కవిత ప్రస్తావించారు. గతంలో సింగరేణి కార్మిక సంఘం టిబిజికెఎస్ గౌరవ అధ్యక్షురాలుగా పనిచేసిన కల్వకుంట్ల కవిత సిఎం కెసిఆర్ నాయకత్వంలో కార్మికుల సంక్షేమంకోసం నిరంతరం పాటుపడ్డారు. అలాగే కేంద్రప్రభుత్వం ప్రతిపాధించిన 42 బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసకార్యక్రమాలు చేపట్టారు. మైనింగ్ రంగంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని కవిత చేసిన పోరాటాలు నేడు ఫలితాలు ఇస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాకు చెందిన రాసకట్ల సంధ్య అండర్ గ్రౌండ్ మైన్స్‌లో ఎన్‌సిఎంఎంసి ధృవీకరణ పత్రాన్ని పొందారు. బిటెక్ మైనింగ్ చదివిన సంధ్య రాజస్తాన్ ఉదయపూర్‌లోని హిందుస్తాన్ జింక్ లిమిటెడ్(వేదాంత) కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెతండ్రి రఘు సింగరేణి కార్మికుడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News