Monday, April 29, 2024

ప్రభుత్వ వివరణ లేకుండా స్టే ఇవ్వలేం

- Advertisement -
- Advertisement -

Stay cannot be Given without Govt Explanation on LRS

ఎల్‌ఆర్‌ఎస్‌పై హైకోర్టు వ్యాఖ్యలు

హైదరాబాద్‌ః రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన మూడు పిటిషన్లను గురువారం నాడు హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్లను విచారించిన హైకోర్టు ప్రభుత్వ వివరణ తెలియకుండా స్టే ఇవ్వలేమని పేర్కొంది. ఈక్రమంలో ఎల్‌ఆర్‌ఎస్‌తో పేద, మధ్యతరగతివారిపై భారం పడుతుందని, అందువల్ల స్టే విధించాలని. పేద, మధ్యతరగతి వారు ఎల్‌ఆర్‌ఎస్ వలన ఇబ్బందులు పడుతున్నారన్న పిటీషనర్స్ హైకోర్టుకు వాదనలు వినిపించారు. ఎల్‌ఆర్‌ఎస్ పై స్టే విధించాలని హైకోర్టును పిటీషనర్స్ కోరినప్పటికి, ప్రభుత్వ వివరణ తెలియకుండా స్టే ఇవ్వలేమని హైకోర్టు పేర్కొంది. రాష్ట్రంలో అక్రమంగా లేఅవుట్లు లేకుండా చేయడం కోసం ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకొచ్చిందని, అక్రమ ఎల్‌ఆర్‌ఎస్ అనేవి లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకురావడం జరిగిందని ఎజి కోర్టుకు విన్నవించారు.

పూర్తి వివరాలతో ఈ నెల 11న కౌంటర్ ధాఖలు చేస్తామన్న ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానికి తెలిపారు. తదుపరి విచారణ ఈ నెల 12కి హైకోర్టు వాయిదా వేసింది.రాష్ట్రంలో అక్రమ లే అవుట్లు లేకుండా చేసేందుకే ఎల్‌ఆర్‌ఎస్ తెచ్చిందని ఎజి కోర్టుకు వివరించారు. ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో మొదటి నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందే ఇదే అంశంపై ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారిందని, ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టు ప్రభుత్వం వివరణల లేకుండా స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది.

Stay cannot be Given without Govt Explanation on LRS

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News