Sunday, May 5, 2024

నాదల్ అరుదైన రికార్డు

- Advertisement -
- Advertisement -

Rafael Nadal 1000th ATP Tour Win

పారిస్: స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. కెరీర్‌లో 1000వ విజయం సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పారిస్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ రెండో రౌండ్‌లో పెలిసియానో లోపేజ్‌ను ఓడించడం ద్వారా నాదల్ ఈ ఘనతను సాధించాడు. ఈ క్రమంలో కెరీర్‌లో వెయ్యి విజయాలు సాధించిన నాలుగో ఆటగాడిగా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకు ముందు స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్, అమెరికా స్టార్లు ఇవాన్ లెండిల్, జిమ్మి కానర్స్‌లు మాత్రమే కెరీర్‌లో వెయ్యికి పైగా విజయాలు సాధించారు. తాజాగా వీరి సరసన నాదల్ నిలిచాడు. ఇదిలావుండగా పురుషుల టెన్నిస్‌లో నాదల్ ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ సాధించిన ఆటగాడిగా రోజర్ ఫెదరర్‌తో సమంగా నిలిచాడు.

Rafael Nadal 1000th ATP Tour Win

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News