Tuesday, November 28, 2023

అరవింద్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి అరవింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తాను నిజామాబాద్ ఎంపిగానే పోటీ చేస్తా గెలుస్తా నని, అరవింద్ కోరుట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు పారిపోతున్నాడని కవిత ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఐటీ జాబ్స్ వస్తే ఎంపి అరవింద్‌కు ఎందుకంత అక్కసు, కడుపుమంట అని ప్రతిపక్షాలు సైతం జీర్ణించుకోలేక పోతున్నాయని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే గణేష్ బిగాల,ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్,మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు అరవింద్ కూడా అలవాటు ప్రకారం అవాకులు చెవాకులు పేలుతూ అత్యంత దారుణంగా మాట్లాడారన్నారు. 280 ఉద్యోగాలు ఇస్తే ఏమైతది, ఎందుకోసం ఇచ్చారు, ఇంకా ఎంత అవహేళనగా మాట్లాడరంటే తన పార్లమెంట్ ఆఫీసులోనే ఉద్యోగాలు చేసేటోళ్లు 20 మంది ఉన్నారని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మేం జీతగాళ్ల గురించి మాట్లాడటం లేదని, ఉద్యోగాల గురించి, వ్యాపారాలు చేసే స్థోమత కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కవిత పేర్కొన్నారు. సిఎంకు సవాల్ విసిరే స్థాయి అరవింద్‌ది కాదని కవిత సూచించారు.

అరవింద్ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్…
అరవింద్ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారని కవిత ధ్వజమెత్తారు. నిజామాబాద్‌లో 2 లక్షల 77 వేల పెన్షన్లకు రూ. 4 వేల కోట్లు బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. 2 లక్షల 59 వేల మంది రైతులకు రూ. 2,616 కోట్లు రైతుబంధు రూపంలో ఇచ్చిందన్నారు. 4,700 మంది రైతులు చనిపోతే రూ. 239 కోట్లు రైతుబీమాను ప్రభుత్వం ఇచ్చిందని, రూ. 2,800 కోట్లు రుణమాఫీ చేశామని, 77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించామన్నారు. దీనికి రూ. 13 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. వీటిలో బిజెపి కాంట్రిబ్యూషన్ ఏముందని కవిత ప్రశ్నించారు. నిజామాబాద్‌కు ఇది కావాలని పార్లమెంట్‌లో ఒక్కనాడు కూడా ఎంపి మాట్లాడలేదని, కానీ, పాలిటిక్స్ మాత్రం మాట్లాడుతారన్నారు.

కాళేశ్వరంపై బిజెపి ఎంపి తప్పుడు ప్రచారం చేశారని, దానికి మా ఎంపిలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారని కవిత తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్ ప్రారంభించి మంచి మంచి కంపెనీలను తీసుకొచ్చామ కవిత తెలిపారు. ఆ కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించామన్నారు. మొత్తం ఈ ఐటి టవర్ కెపాసిటీ 750 ఉంటే ఇప్పటికే దాదాపు 280 మందికి కాల్ లెటర్స్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్పించి, వారి సమక్షంలోనే ఐటి టవర్‌ను ప్రారంభించుకున్నామన్నా రు. అది చూసి ప్రతిపక్షాలు ఉలిక్కిపడ్డాయన్నారు. కాం గ్రెస్ నుంచి మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ లాంటి నేతలు సైతం తమ అక్కసును వెళ్లగక్కారన్నారు. బండి సంజయ్‌కు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదని, 24 గంటల కరెంటు లేదంటున్న సంజయ్ కరీంనగర్ బిజెపి ఆఫీస్ కరెంటు స్విచ్‌లో వేలు పెట్టి చూడాలన్నారు.

ఎంపి అరవింద్ ఓ దౌర్భాగ్యుడు: బాజిరెడ్డి
ఎమ్మెల్యే, ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ పదేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా ఎట్లుండే ఇప్పుడు ఎలా ఉందో ప్రజలకు తెలుసన్నారు. ఎమ్మెల్యేలుగా తాము నిత్యం ప్రజల్లోనే ఉంటున్నామన్నారు. నిజామాబాద్‌కు ఐటీ హబ్ తో యువతకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయన్నారు. ఎంపి అరవింద్ ఓ దౌర్భాగ్యుడని, ఆయన ఎంపిగా గెలవడంతో నిజామాబాద్ ఇరవై ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. అరవింద్ సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉంటారని, ఇపుడు గెలిచే పరిస్థితి లేదని, డిపాజిట్ కూడా దక్కదన్నారు.
అరవింద్ చిల్లర రాజకీయం : బిగాల
ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ ధర్మపురి అరవింద్‌కు కూల గొట్టడమే తెలుసు, అందుకే మా అభివృద్ధి పనులను పాడు కావాలని కోరుకుంటున్నాడన్నారు. అరవింద్ చిల్లర రాజకీయం చేస్తున్నారన్నారు. బిజెపి ఎప్పటికీ తమకు పోటీ కాదన్నారు. తెలంగాణ లో బిజెపికి ఉంది టెంపరరీ ఓటింగ్ మాత్రమేనన్నారు. నోరు అదుపులో పెట్టుకో, ఒళ్లు దగ్గర పెట్టుకో అరవింద్ అంటూ ఆయన హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News