Thursday, January 16, 2025

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట్లో విషాదం

- Advertisement -
- Advertisement -

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బాల సరస్వతి కాసేటిక్రితం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. వయసు రీత్యా అనారోగ్య సమస్యలు తలెత్తడంతో గత మూడు రోజులుగా హైదరాబాద్ లోని కిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో బుధవారం మరణించారు. ఆమె మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మరికాసేపట్లో ఆమె భౌతికకాయాన్ని ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి ఇంటికి తరలించనున్నారు. ఆమె మృతితో కీరవాణి ఇంట విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News