Sunday, June 16, 2024

రాజీనామా చేయకుండానే రాజీలేని పోరు మోడీ కుట్రలు సాగనివ్వను: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జైలుపాలయిన తాను సిఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఒకవేళ తాను వైదొలిగితే ఇదో తంతుగా తీసుకుని బిజెపి దేశంలోని ప్రతిపక్ష సిఎంలను లక్షంగా చేసుకుని దెబ్బతీయడంలో పట్టపగ్గాలు లేకుండా చేస్తుందని విశ్లేషించారు. పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో కేజ్రీవాల్ స్పందించారు. తన తరువాత మమత బెనర్జీని, ఆ తరువాత స్టాలిన్‌ను ఈ విధంగా ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటారని, వారిని ఏదో విధంగా పదవినుంచి తప్పించేందుకు , ముందు జైలుకు పంపించేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో తాను రాజీనామా చేయడం ఆనవాయితీ అవుతుందన్నారు. మద్యం కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ .జూన్ 1న తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మరి సిఎం పదవి నిర్వహణ విషయం ఏమిటనేది కీలకం అయింది.

తనకు పదవి ముఖ్యం కాదని, తాను ఢిల్లీలోని మురికివాడల ప్రజల కోసం పాటుపడిన వాడినని , కీలకమైన ఆదాయపు పన్ను కమిషనర్ పోస్టుకు రాజీనామా చేయగానే ముందుగా ప్రజల వద్దకు వెళ్లానని చెప్పారు. తొలిసారి సిఎం అయిన తరువాత 49 రోజులకే 2013లో సిఎం పదవికి రాజీనామా చేశానని, అప్పట్లో తన రాజీనామాకు ఎవరూ డిమాండ్ చేయలేదని గుర్తు చేశారు. ప్యూన్ పోస్టును కూడా వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడని రోజులివి అటువంటిది తాను సిఎం పదవిని త్యజించానని , అయితే ఈసారి తాను రాజీనామాకు దిగే ప్రసక్తే లేదని , పదవిలో కొనసాగడమే తన పోరులో భాగం అని, తాను రాజీనామా చేసినట్లు అయితే కాచుకుని ఉన్న శక్తులకు ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.

ఢిల్లీ ఎన్నికలలో ఆప్‌ను ఓడించడం తరం కాదనే ప్రధాని మోడీ కుట్రపన్ని ఇప్పుడు తనను జైలుపాలుచేశాడని కేజ్రీవాల్ విమర్శించారు. అరెస్టు అయితే తాను రాజీనామా చేస్తానని, ప్రభుత్వం పడిపోతుందని మోడి అంచనావేశాడు. అయితే ఈ పన్నాగాలు సాగనిచ్చేది లేదని , మొత్తం ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసు ఓ పెద్ద బూటకం అన్నారు. మద్యం స్కామ్ విలువ రూ 1100 కోట్లు అని బిజెపి వారు ముందుగా చెప్పారు. మరి వందకోట్ల మేరకు స్కామ్ జరిగిందని ఇప్పుడు బిజెపి చెపుతోందని, మరి రూ వేయి కోట్లు ఎటుపోయినట్లు? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News