Wednesday, November 6, 2024

నొప్పి పూర్తిగా తగ్గిపోయింది.. ఫిట్‌నెస్‌పైనే దృష్టి: మహ్మద్ షమి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తాను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని, ఇకపై పూర్తి దృష్టి ఫిట్‌నెస్‌పైనే పెడుతానని టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్ తర్వాత షమి చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి షమి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం షమి బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

రానున్న బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియాలో చోటు సంపాదించాలనే లక్షంతో కనిపిస్తున్నాడు. దీని కోసం ఫిట్‌నెస్ సాధించడంపై పూర్తి దృష్టి సారించాడు. తనకు ఎలాంటి నొప్పి లేదని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, త్వరలోనే దేశవాళీ క్రికెట్‌లో ఆడతానని షమి స్పష్టం చేశాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో సత్తా చాటి భారత జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని వివరించాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో మళ్లీ క్రికెట్‌లో అడుగుపెడతానని షమి పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News