Tuesday, May 7, 2024

మోకిలలో అదే జోరు

- Advertisement -
- Advertisement -

మోకిల ప్లాట్ల కోసం పోటీ పడుతున్న ఔత్సాహికదారులు

గరిష్టంగా గజం ధర రూ.75వేలు.. కనిష్టంగా రూ.56 వేలు
రెండో రోజు ప్రభుత్వానికి ఆదాయం రూ.131.72కోట్లు
నేటితో పాటు 28, 29వ తేదీల్లో కొనసాగనున్న ఈ-వేలం

మనతెలంగాణ/ హైదరాబాద్ : మోకిలలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) రెసిడెన్షియల్ లే అవుట్‌లో ప్లాట్ల కొనుగోలుకు రెండో రోజు అదే జోరు కొనసాగింది. హెచ్‌ఎండిఏ దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో 300 గజాల చొప్పున 1,321 ఫ్లాట్లతో మోకిలలో రెసిడెన్షియల్ లేఅవుట్ ను రూపొందించింది. మోకిలలో రెండో విడతలో చేపట్టిన ప్లాట్ల ఈ -వేలానికి కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. తొలిరోజు 60 ప్లాట్లను వేలం వేయగా.. గరిష్ఠంగా చదరపు గజానికి రూ. లక్ష ధర పలికింది. 19275 చదరపు గజాలు అమ్ముడుపోగా.. హెచ్‌ఎండిఎకు రూ.122.42 కోట్ల ఆదాయం వచ్చింది.

రెండో రోజు (గురువారం ) ఉదయం 30 ప్లాట్లను వేలం నిర్వహించగా, అన్ని ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఉదయం జరిగిన వేలంలో గజం ధర అత్యధికంగా రూ.72,000లు పలుకగా, కనిష్టంగా గజం ధర రూ.56,000ల వరకు వచ్చింది. మధ్యాహ్నం 30 ప్లాట్ లకు వేలం జరగగా అన్ని అమ్ముడుపోయాయి. మధ్యాహ్నం నుంచి జరిగిన వేలంలో గజం ధర అత్యధికంగా రూ.75,000లు పలుకగా, కనిష్టంగా గజం ధర రూ.56,000ల వరకు వచ్చింది. మొత్తంగా రెండో రోజు మోకిలలో 60 ప్లాట్ల అమ్మకం ద్వారా రూ.131.72 కోట్ల రెవెన్యూ వచ్చింది. శుక్రవారం (25వ తేదీన) మరో 60 ప్లాట్లను ఈ వేలం ద్వారా హెచ్‌ఎండిఎ విక్రయించనున్నది. తిరిగి సోమవారం (28వ తేదీ), మంగళవారం (29వ తేదీ)లలో రోజుకు 60 ప్లాట్ల చొప్పున మోకిల ప్లాట్లను వేలం ప్రక్రియలో అమ్మకానికి ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News