Friday, May 17, 2024

ఈనెల 15నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు మరో మూడు రోజుల్లో కేరళ తీరానికి చేరుకోనున్నాయి. ఇవి ఈ నెల 15నాటికి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు వాతవారణ శాఖ అంచనావేసింది. గత మూడేళ్లుగా నైరుతి రుతుపవనాలు దేశంలోకి నిర్ణీత సమయంలోనే ప్రవేశించాయి. జూన్ మొదటి వారంలోనే ఇవి కేరళను తాకుతూ వచ్చాయి. సాధారణంగా జూన్ మొదటివారంలో రుతుపవనాల విస్తరణతో తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవాల్సివుంది. ఈ ఏడాది ఆ రెండు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దక్షిణాదిలోని తెలంగాణ, ఏపి , కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

జూన్ తొలివారంలో ఈ విధమైన భారీ ఉష్ణోగ్రతలతో వడగాలులు వీయడం తెలంగాణలో అరుదే అని వాతావరణ విభాగం నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాల కదలికలు వాతావరణ శాఖ అంచనాలకు అందటం లేదు. ఈ ఏడాది కొంత ఆలస్యంగా జూన్ 4 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని వేసిన అంచనాలు తప్పాయి. మంగళవారం ఐఎండి విడుదల చేసిన తాజా బులిటిన్ మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది. గుజరాత్‌లోని పోర్ బందరుకు దక్షిణ ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. గోవాకు పశ్చిమంగా నైరుతి దివలో 920 కి.మి , ముంబాయికి నైరుతి దిశలో 1120 కిమి, పోర్ బందర్‌కు దక్షిణంగా 1160, కిమ, పాకిస్థాన్‌లోని కరాచికి దక్షిణంగా 1520 కిమి వేగంతో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండి వెల్లడించింది.

ఇది దాదాపు ఉత్తరం వైపుగా కదిలి ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా రానున్న 24గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ అల్పపీడన తీవ్రత దేశంలోకి రుతుపవనాల రాకను ప్రభావితం చేస్తుందని వెల్లడించింది. స్కైమెట్ వెదర్ సంస్థ తాజా అంచనాల ప్రకారం జూన్ 8లేదా9 తేదిల్లో రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. గత ఏడాది నైరుతి రుతుపవనాలు కేరళలోకి మే29న ప్రవేశించాయి. 2021లో కూడా జూన్ 3నే ప్రవేశించాయి. 2020లో జూన్ 1న, 2019లో జూన్ 8న, 2018లో మే 29న ఇవి కేరళలోకి ప్రవేశించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News