Sunday, April 28, 2024

మూలపేట, విష్ణు చక్రం మరో ముంబయి, మద్రాస్‌లాగా మారుతాయి…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపిలో ఇప్పటి వరకు నాలుగు పోర్టులు మాత్రమే ఉండగా వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు పోర్టులకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌తో సహా హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సిఎం జగన్  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకాకుళం ముఖచిత్రాన్ని మార్చివేస్తాయని, గత పాలకులు శ్రీకాకుళం జిల్లాను నిర్లక్షం చేశారని మండిపడ్డారు. ఇకపై మూలపేట అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుందన్నారు. భవష్యత్‌లో మూలపేట, విష్ణు చక్రం మరో ముంబయి, మద్రాస్ కాబోతున్నాయని జగన్ ప్రశంసించారు.

Also Read: Viveka Case: ఆ ఇద్దరితో కలిసి అవినాశ్‌ను ప్రశ్నించనున్న సిబిఐ

24 నెలల్లో పోర్ట్ పూర్వవుతుందని, పోర్టు నిర్మాణానికి రూ.4362 కోట్లు ఖర్చు చేస్తున్నామని, పోర్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 35 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. పోర్టు వస్తే.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయని జగన్ వివరించారు. అప్పుడు లక్షల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, మన పిల్లలకు మన జిల్లాలోనే ఉద్యోగాలు అవకాశాలు వస్తాయని జగన్ వివరించారు. గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టామని, గంగపుత్రులు వేరే ప్రాంతాలకు వలసలు పోకుండా ఉండేందుకు కృషి చేస్తున్నామని, పోర్టుతో పాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని, బుడగట్లపాలెం తీరంలో రూ.365 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News