- Advertisement -
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ట్రంప్ విధించిన 25 శాతం సుంకాల నిర్ణయం అమలులోకి వచ్చింది. 6వ తేదీ నుంచి భారతీయ సరుకులపై ఈ సుంకాల వసూళ్లు ఆరంభం అవుతాయి. అయితే మరోసారి ట్రంప్ సుంకాల పెంపు విషయంలో మరోసారి కఠిన నిర్ణయం తీసుకున్నారు. రానున్న 24 గంటల్లో భారత్‌పై సుంకాలను గణనీయంగా పెంచుతామని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. ఆమెరికాకు భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదని అన్నారు. అమెరికాతో భారత్ పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహిస్తుంది.. కానీ, అమెరికా మాత్రం భారత్‌తో వ్యాపారం చేయదని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని.. తద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తోందని ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
- Advertisement -