Thursday, November 30, 2023

పదేళ్ల క్రితం ప్రేమపెళ్లి.. పిల్లలతో జలాశయంలో దూకిన తల్లి

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో ఓ మహిళ, 14 నెలల బాలుడు సహా ముగ్గురు పిల్లలు మృతి చెందారు. బోయిన్‌పల్లి మండలం శాబాష్‌పల్లి వంతెనపై నుంచి రిజర్వాయర్‌లోకి దూకి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన రజిత అలియాస్‌ నేహాతో పాటు కుమారుడు మహ్మద్‌ అయాన్‌ (7), అష్రాజా బెన్‌ (5), ఉస్మాన్‌ అహ్మద్‌ (14 నెలలు) రెండు రోజుల క్రితం రిజర్వాయర్‌లో దూకారు.

శుక్రవారం ఉదయం నీటిలో మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వేములవాడ రూరల్ మండలం రుద్రవరానికి చెందిన రజిత కరీంనగర్‌కు చెందిన మహ్మద్‌ అలీతో ప్రేమ వివాహం చేసుకుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే మనస్తాపం చెందిన రజిత ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News