Sunday, May 5, 2024

రైతుల ఖాతాలో రూ. 4,006 కోట్లు జమ: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 Grain

 

త్వరితగతిన రైసుమిల్లులకు ధాన్యాన్ని తరలించాలి
83 శాతం మందికి ఉచిత బియ్యం పంపిణీ
పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంగళవారం నాటికి రైతుల ఖాతాలో రూ. 4,006 కోట్లను జమ చేశామని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 6341 కొనుగోలు కేంద్రాల ద్వారా 7.10 లక్షల మంది రైతుల నుంచి రూ. 7,404 కోట్ల విలువైన 40.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇందులో 38.44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులకు తరలించడం జరిగిందని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఒక్కరోజే రూ. 290 కోట్లను విడుదల చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా త్వరితగతిన రైసు మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 87.55 లక్షల కుటుంబాలకుగాను బుధవారం నాటికి 72.73 లక్షల (83శాతం) మంది కార్డుదారులకు 2 లక్ష 72 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 2,488 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేయడం జరిగిందని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News