Saturday, April 27, 2024

అది నాకు అరేంజ్డ్ మ్యారేజ్ లాంటిది

- Advertisement -
- Advertisement -

Movie is like an Arranged Marriage to me: Shruti Haasan

 

శృతిహాసన్‌కు ఏదీ దాచుకోవడం ఇష్టం ఉండదు. తనకు సంబంధించిన ఎన్నో రహస్యాలను ఇప్పటికే బయటపెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. తన బాయ్ ఫ్రెండ్ వివరాలతో పాటు తన ఆరోగ్య సమస్యలను కూడా బయటపెట్టింది. ఇప్పుడు తన కెరీర్‌కు సంబంధించిన మరో కీలకమైన విషయాన్ని కూడా తెలియజేసింది. శృతిహాసన్‌కు అసలు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదట. కేవలం డబ్బు సంపాదించడం కోసం ఓ రెండు సినిమాలు చేసి ఆపేద్దామని అనుకుందట. ఆ డబ్బు కూడా తన కోసం కాదు… తన రాక్ బ్యాండ్ కోసం సంపాదించాలనుకున్నానని తాజాగా బయటపెట్టింది శృతిహాసన్. “నా బ్యాండ్ రిహార్సల్స్‌కు డబ్బు కావాలి. బ్యాండ్‌లో వ్యక్తులకు డబ్బులివ్వాలి. డ్రమ్ కిట్‌తో పాటు యమహా మిక్సర్ కొనుక్కోవాలి. ఇంటి అద్దె కట్టాలి. ఈ లెక్కలన్నీ రాసుకున్నాను.

బ్యాలెన్స్ షీట్ తయారుచేసుకున్నాను. ఆ డబ్బు సంపాదించడం కోసం సినిమా చేయాలనుకున్నాను. ఒకే ఒక్క సినిమాతో ఆ డబ్బు సంపాదించి తప్పుకుందామనుకున్నాను. సినిమా రిలీజయ్యే టైమ్‌కు రాక్ స్టార్ అయిపోవాలని కలలు కన్నాను”అని పేర్కొంది. ఇలా తను సినిమాల్లోకి ఎందుకొచ్చిందనే విషయాన్ని బయటపెట్టింది శృతిహాసన్. “ఎప్పుడైతే సినిమాల్లోకి వచ్చానో అలా సినిమాను ప్రేమించడం మొదలుపెట్టాను. ఇంకా చెప్పాలంటే సినిమా అనేది నాకు అరేంజ్డ్ మ్యారేజ్ లాంటిది. మెల్లమెల్లగా ప్రేమించడం మొదలుపెట్టాను. ఇప్పుడు సినిమా లేకుండా ఉండలేకపోతున్నాను”అని చెప్పింది. అయితే సినిమాతో పాటు మ్యూజిక్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తానంటోంది శృతిహాసన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ పూర్తయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News