Monday, April 29, 2024

దుబాయి చేరిన ధోనీ సేన

- Advertisement -
- Advertisement -

Chennai Super Kings players arrive in Dubai for IPL

 

దుబాయి: ఐపిఎల్ రెండో దశ మ్యాచ్‌ల కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) ఆటగాళ్లు దుబాయి చేరుకున్నారు. కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగి పోయిన మ్యాచ్‌లను యుఎఇ వేదికగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక మిగిలిన మ్యాచ్‌లను ఆడేందుకు సిఎస్‌కె టీమ్ దుబాయి చేరుకుంది. దీంతో గల్ఫ్ గడ్డపై ఇప్పుడే ఐపిఎల్ సందడి మొదలైంది. కిందటి ఏడాది కూడా యుఇఎ వేదికగా ఐపిఎల్ జరిగిన విషయం తెలిసిందే. ఇక సిఎస్‌కె కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సీనియర్ ఆటగాళ్లు రాబిన్ ఉతప్ప, సురేశ్ రైనాలతో పాటు రుతురాజ్ గైక్వాడ్ తదితరులు భారత్ నుంచి దుబాయి చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సిఎస్‌కె యాజమాన్యం ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. సిఎస్‌కె ఆటగాళ్ల రాకతో దుబాయిలో క్రికెట్ సందడి నెలకొంది. మ్యాచ్‌లు ఆరంభమయ్యేందుకు నెల రోజులుకు పైగా సమయం ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉండక తప్పదు.

దీంతో ముందుగానే దుబాయికి చేరుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అందరికంటే ముందే సిఎస్‌కె ఆటగాళ్లు గల్ఫ్ గడ్డపై అడుగు పెట్టారు. ఇక సిఎస్‌కె ఆటగాళ్లు కొన్ని రోజులపై హోటల్ గదులకే పరిమితమవుతారు. తర్వాత వారికి పలు దఫాలుగా కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అందులో నెగెటివ్ వచ్చిన వారికే ప్రాక్టస్ సెషన్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇస్తారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలి దశ ఐపిఎల్ మ్యాచ్‌లు జరిగాయి. కానీ ఈ సమయంలో పలువురు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, కోచ్‌లు కరోనా బారిన పడడంతో టోర్నీని మధ్యలోనే నిలిపి వేశారు. ఆగి పోయిన మ్యాచ్‌లను సెప్టెంబర్ 19 నుంచి యుఎఇలో నిర్వహిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో సిఎస్‌కె తలపడనుంది. ఈ సీజన్‌లో చెన్నై ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించి ప్లే ఆఫ్ రేసులో ముందుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News