Wednesday, May 8, 2024

సైన్యానికి నిధుల కోతపై ఎంపీల సంఘం హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Cut in Military Budget
న్యూఢిల్లీ: కొన్ని పొరుగు దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సాయుధ దళాలకు తగినంత బడ్జెట్ కేటాయింపులు తప్పనిసరి కేటాయించాలని రక్షణ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బుధవారం తెలిపింది. మూలధన వ్యయం కోసం మూడు రక్షణ సేవల డిమాండ్, బడ్జెట్ కేటాయింపులలో అంతరాన్ని ప్రస్తావిస్తూ, రాబోయే సంవత్సరాలలో రక్షణ మంత్రిత్వ శాఖ ఖర్చుల్లో ఎలాంటి తగ్గింపులు చేయకూడదని ఎంపీల సంఘం పేర్కొంది.
బుధవారం లోక్‌సభలో సమర్పించిన నివేదికలో 202223 సంవత్సరానికి మూలధనం కింద రూ. 2,15,995 కోట్ల డిమాండ్‌ను అంచనా వేయగా, రూ. 1,52,369.61 కోట్లు మాత్రమే కేటాయించినట్లు కమిటీ పేర్కొంది. అటువంటి నిధుల తగ్గింపుతో రక్షణ సేవల కార్యాచరణ సంసిద్ధపై రాజీపడుతుందని పేర్కొంది. బిజెపి పార్లమెంటు సభ్యుడు జుయల్ ఓరమ్ నేతృత్వంలోని ఈ కమిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) నాయకుడు శరద్ పవార్ సహా దాదాపు 30 మంది శాసనసభ్యులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News