Thursday, May 2, 2024

ముంబయిలో తొలి రూఫ్‌టాప్ డ్రైవ్-ఇన్ థియేటర్

- Advertisement -
- Advertisement -

Jio rooftop theatre

rooftop theatre 2

‘సూర్యవంశీ’ సినిమాతో ప్రారంభం

ముంబయి: అక్షయ్ కుమార్ నటించిన ‘సూర్యవంశీ’ దేశంలోనే తొలి రూఫ్‌టాప్ డ్రైవ్-ఇన్ థియేటర్‌లో నవంబర్ 5న రిలీజ్ అయింది. ఈ థియేటర్ ముంబయిలోని బికెసిలో ఉంది. రిలయన్స్ రిటైల్,  మల్టీ ప్లెక్స్ చెయిన్ పివిఆర్ లిమిటెడ్ భాగస్వామ్యంతో  ముంబ యిలో జియో వరల్డ్ డ్రైవ్ మాల్ తెరిచారు. దీపావళి కానుకగా రిలయన్స్ ఈ రూఫ్ టాప్ డ్రైవ్ ఇన్ థియేటర్‌ను ముంబయి వాసులకు సౌలభ్యం చేసింది. ఈ థియేటర్ ప్రారంభోత్సవానికి దర్శకుడు రోహిత్ శెట్టి కూడా హాజరయ్యారు.  అసలు డ్రైవ్-ఇన్ థియేటర్ అంటే ఏమిటి? దాని విశేషాలేమిటి? తెలుసుకుందాం:
ఆరుబయట సినిమా చూడాలనుకునే వారి అభిలాష తీర్చేదే ఈ రూఫ్‌టాప్ డ్రైవ్- ఇన్  థియేటర్. ముంబయిలోని రూఫ్‌టాప్ డ్రైవ్-ఇన్ థియేటర్‌కు మీ కారుతో వెళ్లి, కారులో కూర్చునే సినిమాను చూడొచ్చు. ఈ థియేటర్‌లో ఒకేసారి 290 కార్లు పార్క్ చేసుకునే వసతి ఉంటుంది. ఒక్కో కారుకు రూ. 1,200 టిక్కెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక్కో కారులో కేవలం నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. తెర డైమెన్షన్స్ 24మీ. x 10 మీ. ఉంటుంది. ఈ థియేటర్‌లో తినుబండారాలు, బీవరేజెస్ దొరుకుతాయి.
జియో డ్రైవ్-ఇన్ థియేటర్‌లో క్రిస్టీ ఆర్‌జిబి లేజర్ ప్రొజెక్షన్‌తో చూయిస్తారు. కారులో ఉండే సౌండ్ సిస్టం ఎఫ్‌ఎం సిగ్నల్స్ ద్వారా మీకు కావలసినంత సౌండ్‌లో పెట్టుకుని సినిమా చూడొచ్చు. మీకూ రూఫ్‌టాప్ డ్రైవ్-ఇన్ థియేటర్‌లో కారులో కూర్చుని సినిమా చూడాలని ఉంటే ట్రై చేయండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News