Tuesday, April 30, 2024

పనిమనిషిపై అత్యాచారం మురళీ ముకుంద్ అరెస్ట్, రిమాండ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పనిమనిషిపై అత్యాచారం చేసిన కేసులో ఓ ప్రముఖ విద్యాసంస్థ మాజీ చైర్మెన్ మురళీ ముకుంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నాంపల్లి జడ్జి నివాసంలో హాజరుపర్చారు. మురళీ ముకుంద్‌కు 14 రోజుల పాటు జ్యుడీషీయల్ రిమాండ్ విధించారు పోలీసులు మురళీ ముకుంద్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ ఏడాది జూలై 16న ప్రముఖ విద్యాసంస్థ మాజీ చైర్మెన్ మురళీ ముకుంద్ తన ఇంట్లో పనిచేసే పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరిం చాడు.ఈ విషయాన్ని మురళీ ముకుంద్ కొడుకు ఆకాశ్ కు బాధిత యువతి చెబితే అతను ఆమెపై దాడికి దిగాడు. యువతి స్నానం చేస్తున్న సమయంలో ఫోటోలు , వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మురళీ ముకుంద్ ను అరెస్ట్ చేశారు.

బాధితురాలిపై ఈ ఏడాది జూలై 20 న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు బనాయించారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. బాధితురాలిపై సిమ్ కార్డు దొంగతనం కేసు మోపారని చెబుతున్నారు. దీంతో బాధితురాలు మురళీ ముకుంద్ ఇంట్లో పని మానేసింది. తన స్వగ్రామంలోనే ఉంటుంది. అయితే కూతురిని తల్లి నిలదీసింది. దీంతో తనపై అత్యా చారం జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లికి చెప్పింది. దరిమిలా బాధితురాలిని తీసుకుని తల్లి ఈ నెల 18న బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ నిర్వహించారు. తదనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మురళీ ముకుంద్ తనయుడు ఆకాశ్  కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెపై తప్పుడు కేసు బనాయించారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిందితులపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ యాక్ట్ తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News