Tuesday, April 30, 2024

దళిత యువతిపై మురళీ అత్యాచారం… 14 రోజుల రిమాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన ఇంట్లో పని చేసే దళిత యువతిపై మురళీ ముకుంద్ అత్యాచారం చేశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 12 లోని మిథులానగర్ లో నివాసం ఉంటున్నాడు. తన ఇంట్లో పని చేసే యువతిని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. మురళీకి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ముకుంద్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. ఆయనకు సంబంధించిన సెల్‌ఫోన్, పాస్‌పోర్ట్‌ను సీజ్ చేశారు. ఇదే కేసులో ఎ2గా మురళీ ముకుంద్ కుమారుడు ఆకర్ష్ కృష్ణగా గుర్తించారు. ప్రస్తుతం ఆకర్ష్ కృష్ణ పరారీలో ఉండడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆకర్ష్ కృష్ణ కూడా ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ కు గతంలో చైర్మన్ గా పని చేశారు.

Also Read: హుక్కా తాగిన కొడుకుకు పదిమందిలో తండ్రి దేహశుద్ధి(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News