Saturday, April 27, 2024

ఇది బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన హత్య: రాహుల్ ఆరోపణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు తయారవుతున్న ఒక 23 ఏళ్ల తెలంగాణ యువతి హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్రంలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదని, తెలంగాణ యువత కలలు, ఆశయాలను రాష్ట్రంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం హత్య చేయడమేనని ఆయన ఆరోపించారు. గత పదేళ్లుగా బిజెపి రిష్తేదార్ సమితి బిఆర్‌ఎస్, బిజెపి కలసి తమ అసమర్థతతో రాష్ట్రాన్ని నాశనం చేశాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాహుల్ ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి నెలరోజుల్లో యుపిఎస్‌సి తరహాలో టిఎస్‌పిఎస్‌సిని పునర్‌వ్యవస్థీకరిస్తుందని, ఏడాది లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, ఇది తమ పార్టీ గ్యారెంటీ అంటూ రాహుల్ వాగ్దానం చేశారు.

ఉద్యోగ పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న ఒక 23 ఏళ్ల యువతి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని అశోక్ నగర్ ప్రాంతంలోని తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష వైఖరి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని నిరసనలు తెలిపారు.

ఇలా ఉండగా..హైదరాబాద్‌లో యువతి ఆ్తత్మహత్య ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతిని, ఆంవేదనను వ్యక్తం చేశారు. టిఎస్‌పిఎస్‌సి పరీక్షలు పదేపదే వాయిదా పడడం, అక్రమాలు చోటుచేసుకోవడంతో మనస్థాపం చెంది 23 ఏళ్ల విద్యార్థిని తెలంగాణలో ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసిందని ఎక్స్ వేదికగా ఖర్గే పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో తెలంగాణలోని బిఆర్‌ఎస్ ప్రబుత్వ నిర్లక్ష వైఖరి పట్ల రాష్ట్రంలోని వేలాదిమంది యువజనులు తీవ్ర నిస్పృహకు, ఆగ్రహానికి లోనవుతున్నారని ఖర్గే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News