Sunday, April 28, 2024

నాదల్‌లో కొత్త జోష్

- Advertisement -
- Advertisement -

Tough test to Nadal in the ATP Tour Finals

రోమ్ : ప్రపంచ టెన్నిస్‌లో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న ఆటగాళ్లలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఒకడు. పురుషుల గ్రాండ్‌స్లామ్ చరిత్రలో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ సాధించిన ఆటగాడిగా స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సరసన నిలిచాడు. ఇప్పటికే రికార్డు స్థాయిలో 13 ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన నాదల్ మరో రికార్డుపై కన్నేశాడు. ఈ నెల చివర్లో మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ట్రోఫీని సాధించడం ద్వారా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోవాలని తహతహలాడుతున్నాడు.

ఇప్పటికే నాదల్, ఫెదరర్ 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో సమంగా ఉన్నారు. ఇక తనకు ఎంతో కలిసి వచ్చే ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలవడం అత్యధిక గ్రాండ్‌స్లామ్ గెలిచిన ఆటగాడిగా నిలవాలనే పట్టుదలతో నాదల్ ఉన్నాడు. ప్రతిష్టాత్మకమైన రోమ్ ఇంటర్నేషనల్ టైటిల్‌తో నాదల్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఆదివారం జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి, టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)ను ఓడించడం ద్వారా ఫ్రెంచ్ ఓపెన్‌కు సమరోత్సాహంతో సిద్ధమవుతున్నాడు. అంతకుముందు మరో అగ్రశ్రేణి ఆటగాడు అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ)ని కూడా నాదల్ మట్టికరిపించాడు. తాజాగా జకోవిచ్‌ను కూడా ఓడించడంతో నాదల్‌లో కొత్త జోష్ నెలకొంది.

త్వరలో జరిగే రొనాల్డ్ గారోస్ (ఫ్రెంచ్ ఓపెన్)లో ట్రోఫీని సాధించడం ద్వారా నాదల్ టెన్నిస్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పాలని భావిస్తున్నాడు. ఇప్పటికే 13 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌తో నాదల్ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచాడు. ఈసారి కూడా ట్రోఫీని సాధించడం ద్వారా కొత్త ఆధ్యాయానికి నాంది పలకాలనే ఉద్దేశంతో ఉన్నాడు. మట్టి కోర్టు రారాజుగా పేరున్న నాదల్‌కు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎదురేలేదు. ఈసారి కూడా అతనికే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. డొమినిక్ థిమ్ (ఆస్ట్రియా), జ్వరేవ్ (జర్మనీ), సిట్సిపాస్ (గ్రీస్), షపాలోవ్, డానియల్ మెద్వెదేవ్ (రష్యా), జకోవిచ్ తదితరులతో నాదల్‌కు పోటీ ఎదురు కానుంది. అయితే నాదల్ ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే అతన్ని ఓడించడం వీరికి చాలా కష్టంతో కూడుకున్న అంశంగానే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News