Sunday, September 15, 2024

నాగచైతన్య రెండో పెళ్లి రాజస్థాన్ లోనా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు నాగచైతన్య, నటి శోభితను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. వారి నిశ్చితార్థం కూడా ఆగస్టు 8న జరిగింది. అయితే వారి పెళ్లి రాజస్థాన్ లో జరుగనున్నట్లు సమాచారం. అయితే పెళ్లి తేదీ మాత్రం వెల్లడి కాలేదు.

అయితే నాగచైతన్య, శోభిత తమ పెళ్లి కోసం రాజస్థాన్ లో ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ ను ఎంచుకున్నారని వినికిడి. శోభిత వాస్తవానికి వైజాగ్ కు చెందిన యువతి. కానీ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. ఆమె రాజస్థాన్ లో తన పెళ్లిని కోరుకుంటుందని తెలిసింది. కాగా అక్కినేని నాగర్జున మాత్రం పెళ్లికి ఇప్పుడప్పుడే తొందర లేదని ‘టైమ్స్ నౌ’ కు తెలిపారు. సమంత తో విడిపోయాక నాగచైతన్య దిగాలు పడ్డాడు. కానీ ఇప్పుడు కోలుకుని మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు. శోభిత ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘సితార’ కోసం సిద్ధమవుతోంది. నాగాచైతన్య తన తదుపరి చిత్రం ‘తండేల్’ లో బిజీగా ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News