Thursday, May 2, 2024

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘నారప్ప’

- Advertisement -
- Advertisement -

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నారప్ప’. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియమణి ఈ మూవీలో నారప్ప భార్య సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు సినిమా చూసి యూనిట్ సభ్యులను ప్రశంసించారు. ఈ చిత్రానికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. అలాగే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించనున్నారు. వెంకటేష్‌ను ఇంతవరకు చూడని ఒక కొత్త అవతారంలో చూపించనున్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.

Narappa movie gets U/A Censor Certificate

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News