Friday, May 3, 2024

నీట్ పరీక్ష అభ్యర్థులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్

- Advertisement -
- Advertisement -

NEET UG 2021 Dress Code by NTA

న్యూఢిల్లీ: వైద్యకళాశాలల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 12న జాతీయ స్థాయి నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష రాసే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా ప్రత్యేక డ్రెస్ కోడ్ ప్రకటించింది. అబ్బాయిలు పొడుగు చేతుల చొక్కాలు, బూట్లు ధరించి రాకూడదని, అమ్మాయిలు చెవి పోగులు, చైన్లు వంటి ఆభరణాలు పెట్టుకోవద్దని ఆదేశించింది.
డ్రెస్ కోడ్ ప్రత్యేక నిబంధనలివే
నీటి పరీక్ష రాసే విద్యార్ధులు లేత రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా పొడుగు చేతులుండే డ్రెస్‌లు వేసుకోవద్దు. ఒకవేళ మతపరమైన సంప్రదాయం ప్రకారం అలాంటి దుస్తులు వేసుకోవాల్సి వస్తే అలాంటి విద్యార్ధులు మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్ష కేంద్రానికి రావాలి.
అభ్యర్థులు బూట్లు వేసుఉని వస్తే పరీక్ష హాలు లోకి అనుమతించరు. స్లిప్పర్లు, తక్కువ హీల్ ఉండే సాండిల్స్ మాత్రమే వేసుకుని రావాలి.
వ్యాలెట్, పౌచ్, గాగుల్స్ , టోపీలు, హ్యాండ్‌బ్యాగులు వంటివి తీసుకురావొద్దు.
పెన్సిల్ బాక్సు, కాలిక్యులేటర్, పెన్ను, స్కేలు, రైటింగ్ ప్యాడ్, వంటివి కూడా అనుమతించరు.
మొబైల్ ఫోను, బ్లూటూత్, ఇయర్ ఫోన్సు, హెల్త్‌బ్యాండ్, వాచ్‌లు వంటి ఎలెక్ట్రానిక్ పరికరాలు కూడా తమవెంట తీసుకుని రాకూడదు.
అమ్మాయిలు చెవిపోగులు, చైన్సు, ముక్కుపుడక, బ్రాస్‌లెట్ వంటి ఆభరణాలను, అబ్బాయిలు చైన్లు, బ్రాస్‌లెట్లు వేసుకోరాదు.
అభ్యర్ధులు తమ వెంట ఎలాంటి ఆహార పదార్ధాలు, వాటర్ బాటిళ్లు కూడా తీసుకురాకూడదు. అవేవీ పరీక్ష హాలులోకి అనుమతించరు.
దేశ వ్యాప్తంగా వచ్చే ఆదివారం నీట్ పరీక్ష జరగనుంది. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 11 ప్రాంతీయ భాషల్లో పెన్ అండ్ పేపర్ పద్ధతిలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు ఒక గంట ముందే పరీక్ష కేంద్రానికి రావాలి. కరోనా నేపథ్యంలో అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయనున్నారు.

NEET UG 2021 Dress Code by NTA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News