- Advertisement -
హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి స్వప్నబార్ లో వెయిటర్ హత్యకు గురయ్యాడు. బార్ లో కిచెన్ సిబ్బందితో నేపాల్ చెఫ్ చరణ్ దీప్ సింగ్ (35) గొడవపడ్డారు. సర్ది చెప్పేందుకు వెళ్లిన వెయిటర్ శ్రీనివాస్ తోనూ నేపాలీ చెఫ్ వాగ్వాదం అవ్వడంతో కోపంతో బీరు సీసాతో శ్రీనివాస్ తలపై బలంగా చరణ్ రాజ్ సింగ్ కొట్టాడు. నేపాలీ చెఫ్ దాడిలో వెయిటర్ శ్రీనివాస్ (44) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : ప్రేమపెళ్లి… యువకుడి కుటుంబ సభ్యులపై దాడి… యువతిని ఎత్తుకెళ్లారు
- Advertisement -