Wednesday, May 1, 2024

నేపాలీ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Nepali gang arrested in Hyderabad
వ్యాపారి ఇంట్లో భారీ చోరీ చేసిన నిందితులు
ఆరుగురు నిందితుల అరెస్టు, పరారీలో నలుగురు
రూ.72లక్షల విలువైన బంగారు, వెండి, వజ్రాలు చోరీ
రూ.8.45లక్షలు విలువైన వస్తువులు స్వాధీనం

హైదరాబాద్: వ్యాపారి ఇంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ భారీ చోరీ చేసిన నేపాలీ ముఠాను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకోగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.43,000 నగదు, రూ.8,45,000 విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని ఖైరతాబాద్, హిల్ కాలనీ, శ్రీవేణి హౌస్‌లో యగ్నా అగర్వాల్ కుటుంబం ఉంటోంది. ఇందులో నేపాల్‌కు చెందిన దినేష్ షాహిథాకూరి, అనిత షాహి అలియాస్ అనిత పనిమనుషులుగా చేరారు. జీవన్ బహదూర్ చంద్ అలియాస్ జీరా పరారీలో ఉన్నాడు, దేబి కాడాల్, మహేంద్ర బహదూర్ షామిఠాకూర్, ఆయుష్ బహదూర్ షాహి అలియాస్ వికాస్, లాల్‌బహదూర్ షాహి ఠాకూర్, చట్రబహదూర్ షాహి అలాయాస్ చోటు, మీనా, అమర్ బహదూర్ చంద్ అలియాస్ అమ్‌జాం కలిసి చోరీలు చేస్తున్నారు. ఇందులో జీవన్ బహదూర్ చంద్, దేబి కడల్, ఆయుష్ బహదూర్ షాహి, లాల్ బహదూర్ షాహి పరారీలో ఉన్నారు. దేబి కడాల్‌ను నేపాల్ పోలీసులు అరెస్టు చేశారు.

గత నెల 16వ తేదీ తెల్లవారుజామున 2గంటలకు భవనంలోని నాలుగో అంతస్థులో ఓంప్రకాష్ అగర్వాల్, అతడి భార్య సంతోష్ అగర్వాల్ నిద్రిస్తున్నారు. అదే సమయంలో ఇంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న దీపేష్, అతడి భార్య అనిత షాహి, మిగతా ఐదుగురు నిందితులు కలిసి ఇంట్లోకి ప్రవేశించారు. ఓంప్రకాష్ చాతిపై కూర్చుని కాళ్లు, చేతులు కట్టివేసి బెదిరించారు. సంతోష్ అగర్వాల్‌ను కూడా బందించారు. ఆమె బతిమాలడడంతో ఆమెను కొట్టి విడిచిపెట్టారు. ఇంట్లోని అలమారాలో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, వజ్రాలు రూ.72లక్షల విలువైన వస్తువులు, రూ.8,00,000 చోరీ చేసి వెళ్లారు. వారు వెళ్లగానే ఐదవ అంతస్థులో నివసిస్తున్న వారి కోడలు, అళ్లుడిని నిద్రలేపారు. బాధితుల ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన పోలీసులు వెంటనే నేపాల్ బార్డర్ పోలీసులను అప్రమత్తం చేశారు. నిందితులు చోరీ చేసిన సొత్తుతో దీపేష్ షాహి ఠాకూర్, అనిత షాహి అలియాస్ అనిత, చట్ర బహదూర్ అలియాస్ చోటు, మీనా, అమర్ బహదూర్ కలిసి షేక్‌పేటకు వెళ్లారు. సైఫాబాద్ డిటెక్టివ్ ఇన్స్‌స్పెక్టర్ రాజు నాయక్, తదితరులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.

నగరంలో పలు ప్రాంతాల్లో నేపాల్ ముఠా….

చోరీలు చేసేందుకు నేపాల్ నుంచి వచ్చిన ముఠానగరంలోని వివిధ ప్రాంతాల్లో పనిమనుషులుగా, వాచ్‌మెన్‌లుగా పనిచేస్తున్నారు. అందరూ ఒకరికి ఒకరు టచ్‌లో ఉండి చోరీలు చేసేందుకు సమాచారం చెబుతున్నారు. చట్ర షాహీ, మీనా బాధితుల ఇంట్లో ఆగస్టు,2021వరకు పనిచేశారు. ఆ సమయంలో ఇంట్లోని ప్రతి విషయాన్ని మిగతా ముఠా సభ్యులు దీపేష్, జీవన్‌కు చెప్పేవారు. వారి సూచన మేరకు ఇద్దరు పనిమానేసి బెంగళూరుకు వెళ్లి పోయారు. వారి ప్లేస్‌లో దీపేష్, అనిత పనిమనుషులుగా చేరారు. యజమానులకు నమ్మకం కుదిరేవరకు దంపతులు ఇంట్లో పనిచేశారు. ఇంట్లో ఎవరూ లేని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. గత నెల 16వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి వృద్ధులను బంధించి ఇంట్లోని సొత్తును చోరీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News