Thursday, May 2, 2024

త్వరలో కొత్త రేషన్ కార్డులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : వంటగ్యాస్ సిలిండర్ రూ.500కే అందజేస్తాం..రైతులు పండించిన ధాన్యానికి క్వింటాలుకు రూ.500బోనస్ అందజే స్తాం ఈ రెండు పథకాలు వందరోజుల్లో  అమల్లోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నాం అని రాష్ట్ర పౌరసరఫరాలు నీటిపారుదల శాఖల మంత్రి ఉత్త మ్ కుమార్‌రెడ్డి ప్రటించారు. తెలంగాణ పౌరసరఫరాల భవన్‌లో మంగళవారం నాడు ఆ శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల పౌరసరఫరాల శాఖ పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. రాష్ట్రంలో వానాకాలం యాసంగి సీజన్లలో ధాన్యం దిగుబడి,కొనుగోలు కేంద్రాల సేకరణ, మిల్లింగ్ సామర్థం, రైస్‌మిల్లర్ల పనితీరు , రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ తదితర అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించా రు. కేంద్ర ప్రభుత్వం నుంచి తలెత్తుతున్న ఇబ్బందులు, రాష్ట్రానికి ఎఫ్‌సిఐ ద్వారా రావల్సిన బకాయిలు వంటి అంశాలపై ప్రత్యేక నివేదిక రూపొందించి ఇవ్వాలని , తాను రేపు ఢిల్లీలో కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కో రతానని వెల్లడించారు. రాష్ట్రంలో పౌరసరఫరా వ్యవస్థను బలోపేతం చేయటంపై కేంద్ర మంత్రితో చర్చిస్తామన్నారు.

పిడిఎస్ కింద పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యమైన విధంగా లేకపోవడం వల్లనే ఎక్కువమంది ఈ బియ్యాన్ని తినడంలేదని , అందుకే బియ్యం పక్కదారి పడుతున్నాయని కోళ్లపరిశ్రమకు, బీర్ ప్యాక్టరీలకు , ఇడ్లీ దోసెలకు చేరుతున్నాయని తన దృష్టికి వచ్చిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిలో బియ్యంపై రూ.39 ఖర్చు చేస్తున్నాయని , ఆదే ఖర్చుతో పేదలకు నాణ్యమైన బియ్యం అందజేస్తే ఈ పధకం లక్షం నెరవేరుతుందన్నారు. రాష్ట్రంలో 89లక్షల రేషన్ కార్డులు ఉండగా అందులో కార్డుకు ముగ్గురు సభ్యుల చొప్పున రాష్ట్రంలో 2.80కోట్ల మందికి రేషన్ బియ్యం అందుతున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ యోజన పథకం కింద 5కిలోలు ఉచింతగా అందజేస్తుండగా, రాష్ట్రం కిలో బియ్యం కలిపి మొత్తం ఆరు కిలోలు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ సక్రమంగా నిర్వహించి వారికి సకాలంలో నిధులు అందజేయాలన్నారు. పౌరసరఫరాల సంస్థకు ఇప్పటివరకూ రూ.56వేలకోట్లు రుణాలు ఉన్నాయన్నారు. ఇందుకోసం ప్రతినెల రూ.3000కోట్లు వడ్డీలు చెల్లించాల్సివస్తోందన్నారు. ఇప్పటివరకూ పౌరసరఫరాలసంస్థ రూ.11వేల కోట్లు నష్టాల్లో ఉందన్నారు. రైతుల నుంచి కోనుగోలు చేసిన ధాన్యంలో 88లక్షల మెట్రిక్ టన్నులు రైస్‌మిల్లర్ల దగ్గర ఉందన్నారు. వీటి విలువ రూ.18000కోట్లు చేస్తుందన్నారు. 1.17లక్షల టన్నులు కార్పోరేషన్ వద్ద ఉందన్నారు. ఇప్పుడిప్పుడే సేకరించిన ధాన్యం 30లక్షల టన్నుల మేరకు ఉందన్నారు.

పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం సరఫరా విషయంలో మనం మరింత పారదర్శకంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. ప్రతినెల 1.8 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నామని , కానీ ప్రజలు వాటిని ఉపయోగించుకుంటున్నారా అన్నది మనం గమనించాలన్నారు. మొక్కుబడిగా కాకుండా లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలన్నారు. బియ్యం పేదలకు ఎలా ఉపయోగకరమైన పథకం గా ఉంటుందో మనం అధ్యయనం చేయాలన్నారు.రాష్ట్రంలో బియ్యం లబ్దిదారుల నుంచి రాండం చెక్ చెయ్యాలని , ప్రజల నుంచి సమాచారం సేకరించాలలని ఆదేశించారు. ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉండాలన్నారు. పేదలకు ఇస్తున్న బియ్యం వారు తినే విధంగా ఉండాలి తప్ప వేరే విదంగా దుర్వినియోగం కారాదని హెచ్చరించారు. రైస్ మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో జాప్యం ఎందుకు జరుగుతుంది అని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రైతుల నుంచి సివిల్ సప్లై శాఖ ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం వివరాలు మంత్రికి అధికారులు వివరించారు. రాష్ట్రంలో కొత్త కార్డులు మంజూరు అంశం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి వుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల సంస్థ కమీషనర్ అనిల్ కుమార్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News