Friday, May 3, 2024

ఉగాది తర్వాత కొత్త రేషన్ కార్డులు

- Advertisement -
- Advertisement -

ration-card

హైదరాబాద్: నగరంలో నివశించే నిరుపేద ప్రజలకు కొత్త ఆహార భద్రతకార్డులు అందజేసేందుకు పౌరసరఫరాల అధికారులు అర్హుల జాబితాను సిద్దం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఉగాది పండుగ తరువాత అర్హులపై పేదలకు కార్డులు మంజూరుచేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తుంది. రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత కొత్త రేషన్‌కార్డుల జారీ లేదు. గత ఆరునెలల నుంచి స్దానిక ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో వారంతా సీఎంతో చర్చించి నూతన తెలుగు సంవత్సరంలో ఇచ్చేలా చూడాలని కోరడంతో అక్కడ నుండి ఆశాఖకు ఆదేశాలు రావడంతో ఇప్పటివరకు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించేందుకు అధికారులు సిద్దమైతున్నట్లు కిందిస్దాయి సిబ్బంది వెల్లడిస్తున్నారు.

రెండు నెలల్లో ప్రకియ పూర్తి చేసి అందరికి రేషన్ సరుకులు ప్రతి నెలా సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరిస్తున్నారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వివిధ రకాల దృవపత్రాలతో దరఖాస్తులు సమర్పించే వారు. కానీ జిల్లా పౌరసరఫరాల అధికారులు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో వాటిని పక్కకు పెట్టారు. ఉగాది తరువాత పరిశీలన చేసేందుకు కిందిస్దాయి సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 5,58,039 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. వీరంతా నెలవారీగా సమీపంలో ఉన్న రేషన్ దుకాణంలో నెలవారీగా సరుకులు తీసుకుంటున్నారు.

జిల్లా సివిల్ సప్లయి అధికారులకు లక్ష 43వేల దరఖాస్తులు అందినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. నవంబర్ వరకు వచ్చిన దరఖాస్తులో 49వేలు ఆమోదం పొందగా, 28వేల దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు వెల్లడిస్తున్నారు. దీనికి తోడు దరఖాస్తులపై క్షేత్రస్దాయి విచారణ చేపట్టేందుకు సిబ్బంది కొరత వెంటాడుతోంది. అయిన ఎక్కువ సమయం కేటాయించి ప్రజలకు కార్డుల ఎంపిక చేయడమే ప్రధాన కర్తవ్యమంటున్నారు. ప్రాథమిక విచారణ పూర్తియిన తరువాత మిగతా ప్రక్రియ ముందుకు సాగుతుందని, కొత్త కార్డు కోసం మీసేవ ద్వార దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు విచారణ జరిపి ఏసిఎస్‌ఓకు నివేదిక అందించి ఆన్‌లైన్‌లో సిఫార్సు చేస్తారు. దరఖాస్తుదారుడు ఆహారభద్రత కార్డుకు అర్హుడైతే సంబంధిత అధికారి సిఫార్సు మేరకు ఎసీఎస్‌కు కార్డు ఆమోదానికి డిసీఎస్వోకు తెలియజేస్తారు. ఆయన పరిశీలించి కార్డు మంజూరుకు ఆమోద ముద్ర వేస్తారు. అయితే ప్రక్రియ వేగవంతం చేసి పేదలకు రేషన్ ఇబ్బందులు లేకుండా చేస్తామని అధికారులు వివరిస్తున్నారు.

హైదరాబాద్ జిల్లా కొత్త దరఖాస్తుల వివరాలు 

కొత్త దరఖాస్తులు : 1,43,004
ఆమోదం పొందినవి : 49,150
తిరస్కరణకు గురైనవి : 28,104
పెండింగ్‌లో ఉన్నవి : 65,790

New ration cards Will issue After Ugadi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News