Wednesday, May 8, 2024

నైట్ కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తాం: సిపి సజ్జనార్

- Advertisement -
- Advertisement -

Night Curfew Imposed in Telangana

హైదరాబాద్: నైట్ కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని సిపి సజ్జనార్ అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని ఆయన కోరారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిస్తామని సజ్జనార్ పేర్కొన్నారు. నైట్ కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తామన్న సజ్జనార్ అనుమతి ఉన్న రంగాలవాళ్లు ఐడి చూపాలన్నారు. అనవసరంగా రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గతంలో నిబంధనలు ఉల్లంఘించిన వాల్లు ఇంకా కోర్టుల చూట్టూ తిరుగుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నైట్ క‌ర్ఫ్యూ విధించింది. మంగళవారం నుంచి మే1వ తేదీ ఉదయం 5 గంటల వరకు నైట్ క‌ర్ఫ్యూను అమలు చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ  క‌ర్ఫ్యూ ఉంటుందని అధికారులు తెలిపారు. అత్యవసర సేవలు, పెట్రోల్ బంకులు, మీడియాకు క‌ర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్స్‌ నిర్వహణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News