Sunday, April 28, 2024

చెప్పింది చేస్తాడు… ఎప్పుడూ గెలుస్తాడు

- Advertisement -
- Advertisement -

Nikki Haley calls for Trump to be elected

 ట్రంప్‌నే ఎన్నుకోవాలని నిక్కీ హేలీ పిలుపు
రిపబ్లికన్ల జాతీయ సదస్సు ఆరంభం
వీక్.. ఫెయిల్ బిడెన్‌ను ఓడించాలని పిలుపు

వాషింగ్టన్ : రిపబ్లికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌నే తిరిగి దేశాధ్యక్షులుగా ఎన్నుకోవాలని ప్రముఖ ఇండో అమెరికన్ రాజకీయ నాయకురాలు నిక్కీ హేలీ పిలుపు నిచ్చారు. ట్రంప్ విజయాల రికార్డుతో ఉన్న వ్యక్తి అని ఇక బిడెన్ చరిత్ర అంతా పేలవం, అంతకు మించి వైఫల్యాల పుట్ట అని హేలీ ట్రంప్ తరఫున ప్రచారపర్వంలో తెలిపారు. ట్రంప్ బలీయ ఆలోచనలతో ముందుకు సాగే వ్యక్తి. అందుకే గెలుపును సాధిస్తూ వచ్చారని, అయితే ఆయన ప్రత్యర్థి డెమోక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి అయిన జో బిడెన్ ఇందుకు విరుద్ధమైన గతాన్ని మూటకట్టుకుని ఉన్నారని తెలిపారు. ఎక్కడా ఆయన గెలిసిన దాఖలాలు లేవు. సరైన బలమైన ఆలోచనా విధానాలు లేని వ్యక్తి అని తెలిపారు. హెలీ ఇంతకు ముందు ఐరాసలో అమెరికా రాయబారిగా ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు తొలిరోజు సందర్భంగా ఈ లేడీ ట్రంప్ తరఫున బలంగా గళం విప్పారు.

దేశ మంతా తిరిగి ట్రంప్ పక్షాన నిలవాల్సి ఉందని, ఆయననే దేశాధ్యక్షుడిగా ఎన్నుకోవల్సి ఉందని పిలుపు నిచ్చారు. బిడెన్ హారిస్ అధికారిక యంత్రాంగం రావడం అంటూ జరిగితే దేశానికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ప్రపంచమంతా విఫలం అయిన సోషలిజం పంథాను వారు ఎంచుకుంటారని, దీనితో అమెరికా తిరోగమనం తప్పదని తెలిపారు. దేశానికి మాజీ వైస్ ప్రెసిడెంట్ అయిన బిడెన్ ఎక్కడా ఏ విజయం సాధించలేదని, పైగా ఆయన ఇరాన్ పట్ల మంచిగా ఉంటారని. మరో రకంగా ఐసిస్‌కు బాసటగా నిలుస్తారని ఆరోపించారు. ఇటువంటి వారు వస్తే అది కమ్యూనిస్టు చైనాకు ఉపయోగపడుతుందని, అమెరికా ఎప్పుడూ చింతించే స్థితిలో ఉండాలనుకునే వారికి ఈ వ్యక్తి ఓ దైవదూతతో సమానం అని విమర్శించారు. మన విలువలకు విరుద్ధంగా వ్యవహరించడం ఆయన నైజం అని, ఈ క్రమంలో ట్రంప్ వైఖరి భిన్నమైనదని, ఆయన చైనా పట్ల ధృఢమైన వైఖరిని అవలంభిస్తారని, ఐసిస్‌తో తలపడి విజయం సాధించారని, ఇక ఆయన ఏది మాట్లాడినా అది ప్రపంచం వినేలా సముచితంగా ఉంటుందని కొనియాడారు.

48 సంవత్సరాల హేలీని 2024 ప్రెసిడెంట్ ఎన్నికలలో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ఎంచుకుంటారని రాజకీయంగా ఇప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. దీనిపై వ్యాఖ్యానించేందుకు హేలీ నిరాకరించారు. ఇప్పుడు తన దృష్టి అంతా కూడా ట్రంప్ గెలుపుపైనే అని తేల్చిచెప్పారు. ఆయన తిరిగి దేశాధ్యక్షుడు కావాలనే తపనతో ఉన్నానని తెలిపారు. సౌత్ కరోలినాకు రెండు సార్లు గవర్నర్‌గా ఉన్న హేలీ భారతీయ సంతతిరాలు. రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో ఇండో అమెరికన్‌గా ప్రసంగించే అవకాశం ఆమె ఒక్కరికే దక్కింది. నాలుగు రోజుల పాటు రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు జరుగుతుంది. ఈ సందర్భంగానే అధికారికంగా 74 ఏండ్ల ట్రంప్ పేరును దేశ అధ్యక్ష పదవికి పార్టీ తరఫున ప్రకటిస్తారు.

ట్రంప్ ఓడితే దేశానికి చీకట్లే- ఎంఎస్ గ్యాంగ్‌ల అరాచకాలే

అమెరికా ఉజ్వల భవిత అంతా కూడా ట్రంప్ తిరిగి ఎన్నిక కావడంపై ఆధారపడి ఉందని అధికార పక్షం అయిన డెమోక్రాటిక్ పార్టీ నేతలు తేల్చిచెప్పారు. వాషింగ్టన్‌లో ప్రారంభం అయిన అత్యంత కీలక పార్టీ జాతీయ సదస్సులో నేతలు దేశ ప్రజలకు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని పిలుపు నిచ్చారు. ఒకవేళ ట్రంప్ ఈ ఎన్నికలలో ఓడితే అది దేశానికి చీకటి హెచ్చరికే అవుతుందన్నారు. రెండోసారి కూడా ఆయన ఎన్నిక అవసరం అన్నారు. ట్రంప్‌దేశంలో మతస్వేచ్ఛ పరిరక్షకుడుగా ఉన్నారని, అదే విధంగా వర్కర్లకు ఇతర వర్గాలకు మేలు చేస్తున్నారని ఈ ప్రైమ్ టైమ్ సదస్సులో తెలిపారు. ఈ సదస్సు దశలో దేశంలోని వివిధ వర్గాలకు వేర్వేరు వృత్తులకు చెందిన వారు కూడా తమ సందేశాలు వెలువరించారు.

ఓ స్కూల్ టీచర్ స్పందిస్తూ లేబర్ యూనియన్ల నుంచి దేశంలోని కన్సర్వేటివ్ విలువలకు విఘాతం ఏర్పడిందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు నెలకొన్న కరోనా లాక్‌డౌన్ ఇతర పరిణామాలతో ఇబ్బంది ఏర్పడిందని ఓ చిరువ్యాపారి తెలిపారు. నిజానికి ఈ షట్‌డౌన్ అవసరం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొల్లగొట్టుకుని పొయ్యే వారి బెడద పెరిగిందన్నారు. డెమెక్రాటిక్ అభ్యర్థి బిడెన్ విజయావకశాలు పెరిగితే అది దేశానికి ఓ హారర్ సినిమాను చూపిస్తుందని ఓ మతప్రచారకుడు వ్యాఖ్యానించారు. వారు ప్రజలకు ఎటువంటి బలం లేకుండా చేస్తారని, జైళ్లలోని వారిని వదిలేస్తారని, ప్రజలను ఇళ్లల్లోనే బందీ చేస్తారని తరువాత క్రిమినల్ గ్యాంగ్ ఎంఎస్ 13ను ఆహ్వానించి ఇక్కడి వారి ఇళ్ల పొరుగులో తిష్టవేసుకునేలా చేస్తారని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News