Thursday, May 2, 2024

నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ మోషన్ పోస్టర్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ హీరో నితిన్ వరుసగా సినిమాలు చేస్తూ జోరు చూపిస్తున్నాడు. ప్రస్తుతం ‘మాస్ట్రో’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో మూవీని ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్. కొత్త దర్శకుడు ఎంఎం రాజశేఖర్ రెడ్డి తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘మాచర్ల నియోజకవర్గం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. నితిన్ సరసన ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీస్ పై ఈ యాక్షన్ చిత్రం రూపొందుతోంది. కాగా,  త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

Nithin’s 31st film ‘Macherla Niyojakavargam’ launch

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News