Sunday, April 28, 2024

నేడే ఎంగేజ్‌మెంట్

- Advertisement -
- Advertisement -

పెళ్లికి రానున్న స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్

Nitin marriage with Shalini at hyderabad
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. నితిన్, – షాలినిల వివాహాన్ని ఈనెల 26న రాత్రి 8. 30 గంటల శుభముహూర్తాన వైభవంగా నిర్వహించబోతున్నారు. కాగా ఫిబ్రవరిలో పసుపు కుంకుమ ఫంక్షన్ చేసుకున్న నితిన్,- షాలిని జంట ఎంగేజ్‌మెంట్ బుధవారం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులు, కొంతమంది స్నేహితులు, సన్నిహితులు హాజరుకానున్నారని సమాచారం. ఇక ఈనెల 26న నితిన్, షాలినిల వివాహం హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్యాలెస్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరుగనుంది. కరోనా కారణంగా ఇరు కుటుంబ సభ్యులు పరిమితంగానే అతిథులను ఆహ్వానించారని సమాచారం. ఈ పెళ్లికి ముఖ్యంగా నితిన్ ఫేవరెట్ స్టార్ పవన్‌కల్యాణ్, ఫేవరెట్ డైరెక్టర్ త్రివిక్రమ్ హాజరవుతారు. అలాగే తన స్నేహితుడు అయిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హాజరుకానున్నాడట. ఆ ముగ్గురికీ ఇప్పటికే నితిన్ నుంచి ఆహ్వానం అందింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News