Thursday, May 2, 2024

బిఆర్‌ఎస్ ప్రభావం మహారాష్ట్రలో ఉండదు: సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు బిజెపి బి టీమ్‌లా వ్యహరిస్తున్నారని, మహారాష్ట్రకు బిఆర్‌ఎస్‌ను విస్తరించాలన్న ఆయన ప్రయత్నాలు రాష్ట్ర రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపబోవని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

కెసిఆర్ ఈ గిమ్మిక్కులు కొనసాగిస్తే దాని ప్రభావం తెలంగాణపై ఉంటుందని, ఆయన తెలంగాణను కూడా కల్పోతారని మంగళవారం ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో రౌత్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఓడిపోతామన్న భయంతోనే ఆయన మహారాష్ట్రలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని రౌత్ ఆరోపించారు. తెలంగాణ నుంచి భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రలోకి కెసిఆర్ ప్రవేశించారని, అయితే ఆయన పార్టీకి చెందిన నాయకులు భారీ సంఖ్యలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని రౌత్ వ్యాఖ్యానించారు.
బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఈ పోరాటమని, రెండు పార్టీల మధ్య తాము మధ్యవర్తిత్వం వహించగలమని ఆయన అన్నారు. కెసిఆర్ తన ప్రతీకారాన్ని మహారాష్ట్రపై తీర్చుకోవాలనుకుంటే ఆయన సారథ్యంలోని బిఆర్‌ఎస్ బిజెపి బి టీమ్ అని తాము చెబుతామని ఆయన అన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కాని, మహా వికాస్ అఘాడిపై కాని కెసిఆర్ పార్టీ ఎటువంటి ప్రభావం చూపబోదని ఆయన చెప్పారు.

బిజెపి మొదుగా హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని పంపిందని, ఇప్పుడు కెసిఆర్‌ను పంపిందని ఆయన ఆరోపించారు. పోరాడే నాయకుడిగా కెసిఆర్‌కు మంచి పేరు ఉందని, అయితే బిజెపికి ఎందుకు లొగిపోతున్నారో ఆయనే చెప్పాలని రౌత్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మంగళవారం మహారాష్ట్రలోని పండర్‌పూర్‌లో విఠల రుక్మిణి ఆలయాన్ని సందర్శించారు. సోమవారం 600 వాహనాలలో తన మంత్రివర్గ సహచరులు, పార్టీ నాయకులతో కలసి కెసిఆర్ పండర్‌పూర్ చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News