Thursday, May 2, 2024

పేద దేశాలకు కొవాగ్జ్ టీకాల సరఫరాకు అంతరాయం ఉండదు: డబ్ల్యూహెచ్‌ఒ

- Advertisement -
- Advertisement -

NO interruption in supply of Covax vaccine to poor countries: WHO

 

ఐక్యరాజ్యసమితి: పేద దేశాలకు కొవాగ్జ్ పేరుతో చేపట్టిన టీకాల సరఫరాకు అంతరాయమేమీ ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఒ) తెలిపింది. ఇటీవల భారత్‌లో పెద్ద ఎత్తున చేపట్టిన టీకాల కార్యక్రమం వల్ల సరఫరాకు కొరత ఏర్పడుతుందనడంలో నిజం లేదని డబ్ల్యూహెచ్‌ఒ తెలిపింది. కొవిడ్19 నియంత్రణ కోసం 100కుపైగా దేశాలకు కొవాగ్జ్ కింద టీకాలు సరఫరా చేయాలని డబ్ల్యూహెచ్‌ఒ నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మొదటి విడతగా ఫ్రిబ్రవరి 24న ఘనాకు టీకాలను సరఫరా చేసింది. ఇప్పటివరకు ఆరు ఖండాల్లోని 100కుపైగా దేశాలకు 3 కోట్ల 30 లక్షల డోసుల టీకాలను సరఫరా చేసింది. వ్యాక్సిన్లను బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా, అమెరికాకు చెందిన ఫైజర్‌బయో ఎన్‌టెక్, భారత్‌కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) నుంచి డబ్ల్యూహెచ్‌ఒ సేకరిస్తోంది. 2021లో కొవాగ్జ్ కింద 200 కోట్ల డోసుల టీకాలను పేద దేశాలకు సరఫరా చేయాలని డబ్ల్యూహెచ్‌ఒ లక్షంగా నిర్ణయించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News