Tuesday, April 30, 2024

కోర్టు అనుమతితోనే పెరోల్ ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

డేరా బాబా కేసులో హర్యానా సర్కారుకు హైకోర్టు ఆదేశం

చండీగఢ్: అత్యాచారం కేసులో దోషిగా జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీమ్‌కు పదేపదే పెరోల్ ఇవ్వడంపై హర్యానా ప్రభుత్వంపై పంజాబ్, హర్యానా హైకోర్టు పలు ప్రశ్నలను సంధించింది.భవిష్యత్తులో కోర్టు అనుమతి లేకుండా అతనికి పెరోల్ ఇవ్వరాదని హర్యానా ప్రభుత్వాన్ని హైకోర్టు అదేశించింది. ఈ ఏడాది జనవరిలో అతనికి 50 రోజుల పెరోల్ లభించగా గడచిన 10 మాసాలలో ఇది ఏడవసారి.

గత నాలుగేళ్లలో పెరోల్‌పై అతను విడుదల కావడం ఇది తొమ్మిదవ సారి. పెరో ముగియనున్న మార్చి 10న రాం రహీమ్ లొంగిపోయేలా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతేగాక ఇదే తరహాలో ఎంత మంది ఖైదీలకు పెరోల్ ఇచ్చారో సమాచారం అందచేయాలని ఎస్‌జిసి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా గురువారం హర్యానా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అత్యాచార కేసులో దోషిగా తేలిన నాం నహీమఖరే జైలులో లభిస్తున్న సౌకర్యాలను తెలియచేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన రాం రహీమ్‌కు హర్యానా పంచకులలోని ప్రత్యేక సిబిఐ కోర్టు జైలు శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News