Wednesday, May 1, 2024

బిజెపి మళ్లీ గెలిస్తే రూ.2,000 కానున్న గ్యాస్ బండ

- Advertisement -
- Advertisement -

ఝార్‌గ్రామ్: కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే వంట గ్యాసు సిలిండర్ ధరను రూ. 2,000కు పెంచుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. ఝార్‌గ్రామ్ జిల్లాలో గురువారం ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ బిజెపి మళ్లీ కేంద్రంలో అధికారాన్ని చేపడితే వంటగ్యాసు సిలిండర్ ధరను రూ. 1,500 నుంచి రూ. 2,000కు పెంచవచ్చని అన్నారు. మళ్లీ పాత కాలం నాటి పొయ్యి వెలిగించడానికి కట్టెల కోసం వెళ్లాలని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఏప్రిల్ నెలాఖరు నాటికల్లా ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వానికి గడువు విధించారు. లేని పక్షంలో మే నుంచి తన ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణం చేపడుతుందని ఆమె హెచ్చరించారు. కాగా..మహిళలపై అత్యాచారాలు, భూకబ్జాల ఆరోపణలపై టిఎంసి నాయకుడు షాజహాన్ షేక్ అరెస్టు కావడంపై ఆమె స్పందించకపోవడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News